Jio Best Plans: జియో యూజర్లు మెచ్చిన బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్ ఇదే.!

Updated on 06-Dec-2025
HIGHLIGHTS

రిలయన్స్ జియో యూజర్ల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి

అన్లిమిటెడ్ డేటా మొదలుకొని అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని అదనపు లాభాలు కూడా అందిస్తాయి

ఒక నెల వ్యాలిడిటీ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ మొదలుకొని ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ అందించే ప్లాన్స్ ఉన్నాయి

Jio Best Plans: రిలయన్స్ జియో యూజర్ల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అన్లిమిటెడ్ డేటా మొదలుకొని అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని అదనపు లాభాలు కూడా అందిస్తాయి. ఇందులో ఒక నెల వ్యాలిడిటీ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ మొదలుకొని ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ అందించే ప్లాన్స్ ఉన్నాయి. వాటిలో జియో యూజర్లు మెచ్చిన బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే అని జియో ప్రకటించిన ఆ బెస్ట్ ప్లాన్స్ ఈరోజు చూద్దాం.

Jio Best Plans: ఏమిటి ఆ బెస్ట్ ప్లాన్స్?

జియో సైట్ నుంచి ఈ బెస్ట్ ప్లాన్స్ గురించి లిస్ట్ అందించింది. వీటిలో నాలుగు అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఇక ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ విషయానికి వస్తే, ఇందులో రూ. 349, రూ. 899, రూ. 1,029 మరియు రూ. 3,599 రూపాయల నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ అన్ని ప్లాన్స్ కూడా రూ. 35,100 రూపాయల విలువైన గూగుల్ జెమినీ Ai ప్రో యాక్సెస్ కూడా తీసుకొస్తాయి. ఈ నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అందించే బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.

జియో రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్రీపెయిడ్ ప్లే 28 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 20 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా మరియు డైలీ 100 SMS ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2 జీబీ డైలీ డేటా కూడా అందిస్తుంది. ఇదే కాదు ఈ ప్లాన్ తో మూడు నెలల Jio Hotstar సబ్ స్క్రిప్షన్. ఇది అన్లిమిటెడ్ లాభాలు మరియు OTT బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్లాన్ గా ఉంటుంది.

జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా, 4జి నెట్ వర్క్ పై డైలీ 2 జీబీ డేటా + 20 జీబీ అదనపు డేటాతో పాటు డైలీ 100 SMS కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా మూడు నెలల జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.

జియో రూ. 1029 ప్రీపెయిడ్ ప్లాన్

ఇది 84 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ తో 84 రోజులు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా మూడు నెలల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. ఇది OTT యాక్సెస్ తో బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ అవుతుంది.

Also Read: Airtel Plans Removed: మరో రెండు బడ్జెట్ ప్లాన్స్ లిస్ట్ నుంచి తొలగించిన ఎయిర్టెల్.!

జియో రూ. 3,599 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, 4G నెట్ వర్క్ పై డైలీ 2.5 జీబీ డేటా, 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 100 SMS వినియోగ ప్రయోజనం అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా జియో హాట్ స్టార్ మూడు నెలల ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :