Jio Best Plan: బడ్జెట్ ధరలోనే ఎక్కువ ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్స్, రిలయన్స్ జియో యూజర్లకు చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే, నెలకు కేవలం రూ. 230 ఖర్చుతోనే unlimited 5G లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ ఒకటి వుంది. ఈ ప్లాన్ తో నెలకు కేవలం 230 రూపాయల ఖర్చుతోనే అన్లిమిటెడ్ కాలింగ్, డేట్, SMS మరియు మరిన్ని ప్రయోజనాలను యూజర్లు అందుకోవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Jio Best Plan
రిలయన్స్ జియో యొక్క బెస్ట్ బడ్జెట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గా యూజర్ల చేత కొనియాడ బడుతున్న రూ. 2,999 రూపాయల అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలను వివరంగా ఇక్కడ చూడవచ్చు.
జియో రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS ఉపయోగ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే కస్టమర్లు 365 రోజుల పాటు 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటాని ఎంజాయ్ చేయవచ్చు. అదే 4జి నెట్ వర్క్ అయితే, రోజుకు 2.5 GB చొప్పున 912.5 GB ల 4జి డేటాని అందుకుంటారు.
పైన తెలిపిన అన్లిమిటెడ్ ప్రయోజనాలతో పాటుగా జియో టీవీ, జియో సినిమా మరియు జియో క్లౌడ్ వంటి యాప్స్ కు కూడా ఉచిత యాక్సెస్ అందిస్తుంది.