Jio Best Plan with 90 days unlimited benefits
Jio Best Plan: చౌక ధరలో అన్లిమిటెడ్ లాభాలను అందించే ప్లాన్లను ఆఫర్ చేస్తున్న టెలికాం కంపెనీగా జియో నిలుస్తుంది. ఇప్పటికే అనేక బడ్జెట్ ప్లాన్లను తీసుకువచ్చిన రిలయన్స్ జియో, కొత్త ప్లాన్లు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే, తక్కువ ధరలో 90 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే జియో బెస్ట్ ప్లాన్ ఒకటి ఉంది. ఈ ప్లాన్ గురించి ఈరోజు వివరంగా తెలుసుకోనున్నాము.
రిలయన్స్ జియో ముందు నుండి ఆఫర్ చేస్తున్న రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో మూడు నెలల అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది. ఈ జియో బెస్ట్ ప్లాన్ అందిస్తున్న పూర్తి లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: 10 వేలకే లభిస్తున్న Dolby Atmos Soundbar డీల్స్ పైన ఒక లుక్కేద్దామా.!
రిలయన్స్ యొక్క ఈ రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్, 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌలాభ్యాన్ని అందిస్తుంది. ఇది కాకుండా రోజుకు 2GB హై స్పీడ్ డేటా చొప్పున 180GB ల డేటా మరియు 20 GB అధనపు డేటా ని అందిస్తుంది.
అంటే, ఈ జియో ప్లాన్ తో 90 రోజులకు గాను టోటల్ 200GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 90 రోజుల పాటు రోజుకు 100 SMS ల ఉపయోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.
అలాగే, జియో టీవీ, జియో సినిమా మరియు జియో క్లౌడ్ యాప్స్ కి ఉచిత యాక్సెస్ ని కూడా అందిస్తుంది.