JIo Best Offer 2024: 84 రోజులు 14 OTT లను మరియు అన్లిమిటెడ్ లాభాలను అందుకోండి.!
అన్లిమిటెడ్ లాభాలను అందించే Jio బెస్ట్ ఆఫర్
యూజర్ బేస్ ను పెంచుకుంటూ పోతున్న జియో
కొత్త ఎంటర్టైన్మెంట్ ఆఫర్ ను మరియు ప్లాన్ లను తీసుకు వచ్చింది జియో
JIo Best Offer 2024: 84 రోజులు 14 OTT లను మరియు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ఆఫర్ ను రిలయన్స్ జియో అందించింది. కొత్త కొత్త ప్లాన్ లతో తన యూజర్ బేస్ ను పెంచుకుంటూ పోతున్న జియో, తన పోర్ట్ ఫోలియోకి మరొక హరి ఎంటర్టైనమెంట్ ప్లాన్ ను చేర్చింది. ప్రసుతం OTT ప్లాట్ ఫామ్ షబ్ స్క్రిప్షన్ తో వచ్చే ప్లాన్ లను వెతికే వారి సంఖ్య పెరిగి పోతోంది. జియో అందించిన ఈ ఆఫర్ అటువంటి వారి కోసం ఈ ప్లాన్ అందించే లాభాలు సరిపోయే విధంగా ఉంటాయి.
SurveyJIo Best Offer 2024:
2024 సంవత్సర కానుకగా కొత్త ఎంటర్టైన్మెంట్ ఆఫర్ ను మరియు ప్లాన్ లను తీసుకు వచ్చింది రిలయన్స్ జియో. ఇందులో భాగంగా, 28 రోజులుమొదలు కొని 365 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను అందించింది. వీటిలో, కేవలం రూ. 1,198 రూపాయలకే 14 ఓటీటీ ల సబ్ స్క్రిప్షన్ మరియు కాలింగ్, డేటా లను అందించే అన్లిమిటెడ్ ప్లాన్ ను గొప్పగా ఉంటుంది.
Also Read : Fire-Boltt Dream: 4G LTE సిమ్ కార్డ్ తో పనిచేసే స్మార్ట్ వాచ్ వచ్చేసింది.!
జియో రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ ఎటువంటి లాభాలను అందిస్తుంది?
జియో రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.ఈ 84 రోజుల పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 5G నెట్వర్క్ పైన్ అన్లిమిటెడ్ 5జి డేటాని కూడా అందిస్తుంది. అదే 4G నెట్ వర్క్ పైన ఐతే యూజర్లు రోజుకు 2GB డేటా చొప్పున 84 రోజుల పాటు రోజు వారి డేటా అందుతుంది.

ఈ ప్లాన్ తో డైలీ 100 SMS లిమిట్ మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా లభిస్తుంది.
జియో రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ అధనపు లాభం ఏమిటి?
ఈ జియో రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ తో 84 రోజుల పాటు 14 ప్రముఖ ఓటీటీ యాప్స్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఈ యాప్స్ లిస్ట్ ను ఇక్కడ చూడవచ్చు.
Disney+Hotstar మొబైల్, Prime Video మొబైల్ ఎడిషన్, Sony LIV, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, Docubay, EPIC ON మరియు Hoichoi ప్లాట్ ఫామ్ లకు JioTV app ద్వారా యాక్సెస్ ను అందిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile