jio announces jio diwali dhamaka offer which offers 4g phone at rs 699 only
జియో దీపావళి ఆఫర్: జియో యూజర్లకు మరియు దేశ ప్రజలకు దీపావళి పండుగ కానుక అందించింది రిలయన్స్ జియో. దీపావళి 2024 కోసం రూ. 999 రూపాయల విలువైన 4జి ఫోన్ ను రూ. 699 రూపాయల ధరకే ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ తో చాలా చవక రేటుకే అన్లిమిటెడ్ కాలింగ్ అందించే రీఛార్జ్ ఆఫర్ ను అటాచ్ కూడా చేసింది. ఈ ఆఫర్ తో అతి చవక ధరకే అన్లిమిటెడ్ లాభాలు ఇంటికి తెచ్చుకునే అవకాశం జియో అందించింది.
జియోభారత్ 4G ఫోన్‌లను నిన్న మొన్నటి వరకు రూ. 999 రూపాయల వద్ద అందించిన జియో, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ధర తగ్గించింది. 2024 దీపావళి పండుగ సందర్భంగా ఈ ఫోన్స్ ధర తగ్గించి ఇప్పుడు కేవలం రూ. 699 రూపాయల ఆఫర్ ధరకే అందించడం జరిగింది. అంటే, జియోభారత్ 4G ఫోన్‌లను ఇప్పుడు కేవలం రూ. 699 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు.
జియోభారత్ 4G ఫోన్‌లను అతి చవక రేటుకు అన్లిమిటెడ్ లాభాలు అందించే రూ. 123 ప్రీపెయిడ్ ప్లాన్ తో కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ దీపావళికి చవక ప్రీపెయిడ్ ప్లాన్ తో కూడిన జియో 4G ఫోన్ ను మీ ఇంటికి తెచ్చుకోవచ్చని జియో పేర్కొంది.
ఈ జియో భారత్ 4G ఫోన్ పెద్ద స్క్రీన్ అనుకూలమైన కీ బోర్డు మరియు UPI పేమెంట్ వంటి అన్ని అవసరమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
Also Read: Jio Diwali Offer: ఈ రీఛార్జ్ చేస్తే రూ. 3,350 రూపాయల వరకు అదనపు లాభాలు అందుకోండి.!
ఈ ఫోన్ తో వచ్చే రూ. 123 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ తో 28 రోజులు లాభాలు అందుతాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో రోజుకు 0.5GB చొప్పున 14GB డేటా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లే తో 455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్స్, సినిమా ప్రీమియర్లు, సినిమాలతో పాటు లేటెస్ట్ సిరీస్ లను కూడా ఎంజాయ్ చేయవచ్చు.
దీపావళి పండుగ కానుకగా అందించిన ఈ ఆఫర్ ద్వారా అనేక లాభాలు అందుకునే జియో అందించింది.