jio added Jio New Plans with unlimited 5g data benefits under True Unlimited Upgrade
Jio New Plans: జూలై 3 నుంచి పెరిగిన రిలయన్స్ జియో టారిఫ్ రేట్లు పైన కస్టమర్లు చాలా అసహనానికి గురవుతున్నారు. అందుకే కాబోలు కస్టమర్ల అలక తీర్చేందుకు రిలయన్స్ జియో కొత్త Unlimited 5G Data ప్రీపెయిడ్ ప్లాన్ లను తీసుకు వచ్చింది. ఈ కొత్త అన్లిమిటెడ్ 5జి డేటా ప్రీపెయిడ్ ప్లాన్ లను యాడ్ ఆన్ ఫ్యాక్స్ గా తీసుకుని వచ్చింది. ఈ యాడ్ ఆన్ ప్యాక్ లను రీఛార్జ్ చేసే యూజర్లు Jio True 5G నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా లాభాలను ఆస్వాదించవచ్చు.
రిలయన్స్ జియో యూజర్ల కోసం True Unlimited Upgrade పరిధిలో కొత్త అప్గ్రేడ్ యాడ్ యాన్ ప్లాన్ లను జత చేసింది. ఈ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అన్లిమిటెడ్ 5జి డేటా లాభాలను అందుకుంటారు. ఈ ప్లాన్ ను పొందాలంటే ఎగ్జిస్టింగ్ ప్రీపెయిడ్ ప్లాన్ పైన ఈ ప్లాన్ ను యాడ్ ఆన్ గా జత చేయాలి. ఈ ట్రూ అన్లిమిటెడ్ అప్గ్రేడ్ పరిధిలో మూడు ప్లాన్స్ అందించింది. వీటిలో, రూ. 51, రూ. 101 మరియు రూ. 151 ప్లాన్స్ ఉన్నాయి. ఈ మూడు ప్లాన్స్ కూడా యూజర్లకు ఇప్పటికే కొనసాగుతున్న చవక ప్లాన్ లకు కూడా అన్లిమిటెడ్ 5జి డేటా లాభాలను జత చేస్తాయి.
ఈ ప్లాన్స్ పైన ఈ అప్గ్రేడ్ ప్లాన్ లను యాడ్ చేసుకోవచ్చు? అనేది జియో యూజర్లకు ముందుగా వచ్చే ప్రశ్న అవుతుంది. ఎందుకంటే, 2GB మరియు అంతకంటే ఎక్కువ డైలీ డేటా ఆఫర్ చేసే ప్లాన్స్ పైన అన్లిమిటెడ్ 5జి డేటాను జియో ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే, డైలీ 1GB మరియు 1.5GB డేటా ఆఫర్ చేసే ప్లాన్స్ కి అన్లిమిటెడ్ డేటా అందించేలా ఈ కొత్త అప్గ్రేడ్ ప్లాన్ లను అందించింది.
ఈ రూ. 151 అప్గ్రేడ్ ప్లాన్ టోటల్ 9GB 4G డేటా ని తీసుకు వస్తుంది. అయితే, జియో ట్రూ 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా లాభాలని అందిస్తుంది. అయితే, 4G నెట్ వర్క్ పైన లిమిటెడ్ డేటా మాత్రమే వర్తిస్తుంది. ఇది 2 లేదా 3 నెలల కంటే తక్కువ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే వర్తిస్తుంది.
Also Read: Galaxy Watch 7 మరియు Watch Ultra వచ్చేసాయి..ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
ఈ ప్లాన్ టోటల్ 6GB 4G డేటా ని ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో కూడా జియో ట్రూ 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా లాభాలని అందిస్తుంది మరియు 4G నెట్ వర్క్ పైన లిమిటెడ్ డేటా వర్తిస్తుంది. ఈ ప్లాన్ 1 లేదా 1 నెలల కంటే తక్కువ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే వర్తిస్తుంది.
రూ. 51 అప్గ్రేడ్ ప్లాన్ కేవలం రోజుకు 2GB లేదా అంతకంటే ఎక్కువ డేటా అందించే ప్లాన్స్ పైన మాత్రమే వర్తిస్తుంది. అదీకూడా కేవలం 1 నెల వ్యాలిడిటీ ప్లాన్ పైన మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్ తో 3GB 4G డేటా మరియు అన్లిమిటెడ్ 5జి డేటా అందిస్తుంది. అయితే, డైలీ 2GB డేటా ప్లాన్స్ పైన అన్లిమిటెడ్ 5జి మాములుగానే అప్లై అవుతుంది.
మొబైల్ రీఛార్జ్ కోసం Click Here