Jio 2026: జియో యూజర్ల కోసం అందించిన 2026 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్.!

Updated on 14-Jan-2026
HIGHLIGHTS

రిలయన్స్ జియో తన యూజర్ల కోసం Jio 2026 కొత్త ప్లాన్ లను అందించింది

జియో కస్టమర్లకు అధిక లాభాలు మరియు గొప్ప ప్రయోజనాలు అందించే విధంగా New Plans అందించింది

2026 కొత్త సంవత్సరంలో నాలుగు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తన యూజర్ల కోసం అందించింది

Jio 2026: కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూనే రిలయన్స్ జియో తన యూజర్ల కోసం కొత్త ప్లాన్ లను అందించింది. అంతేకాదు, మకర సంక్రాంతి 2026 పండుగ సందర్భంగా కూడా కొత్త ప్లాన్ అనౌన్స్ చేసింది. జియో కస్టమర్లకు అధిక లాభాలు మరియు గొప్ప ప్రయోజనాలు అందించే విధంగా ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రవేశపెట్టినట్లు జియో తెలిపింది. మరి 2026 కొత్త సంవత్సరంలో జియో అందించిన ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఏమిటో చూద్దామా.

Jio 2026 : జియో తెచ్చిన కొత్త ప్లాన్?

రిలయన్స్ జియో 2026 కొత్త సంవత్సరంలో నాలుగు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తన యూజర్ల కోసం అందించింది. ఇందులో వన్ ఇయర్ ప్లాన్ రూ. 3,599, వన్ మంత్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ రూ. 500, రూ. 450 రూపాయల 36 డేస్ అన్లిమిటెడ్ ప్లాన్ మరియు రూ. 103 రూపాయల ఫ్లెక్సీ ప్యాక్ ఉన్నాయి. ఈ నాలుగు ప్లాన్స్ అందించే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

జియో రూ. 3,599 ప్రీపెయిడ్ ప్లాన్

ఇది వన్ ఇయర్ ప్లాన్ మరియు 365 చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ 365 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 4జి నెట్ వర్క్ పై రోజుకు 2.5GB హై స్పీడ్ + అన్లిమిటెడ్ 5G మరియు 100 SMS బెనిఫిట్ కూడా అందిస్తుంది. ఇది కాకుండా రూ. 35,100 విలువైన 18 నెలల జెమినీ Ai ప్రో యాక్సెస్, జియో టీవీ, జియో హాట్ స్టార్, జియో టీవీ మరియు జియో AI క్లౌడ్ వంటి అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.

జియో రూ. 500 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ఎంటర్టైన్మెంట్ స్పెషల్ ప్లాన్ గా జియో అందించింది. ఎందుకంటే, ఈ పాన్ తో రీఛార్జ్ చేస్తే యూజర్లకు అదనపు OTT ప్రయోజనాలు అందుతాయి. యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్ స్టార్, సోనీ లివ్, ప్రైమ్ వీడియో మొబైల్, జీ 5, లయన్స్ గేట్ ప్లే, సన్ నెక్స్ట్, కంచలంక ప్లానెట్ మరాఠీ, డిస్కవరీ ప్లస్, చౌపల్, హోయ్ చోయ్, ఫ్యాన్ కోడ్ వంటి OTT లాభాలు అందిస్తుంది. ఇదే కాదు రూ. 35,100 విలువైన 18 నెలల జెమినీ ప్రో ఎఐ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా తెస్తుంది.

ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే కస్టమర్లకు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా, డైలీ 2జీబీ 4జి డేటా మరియు డైలీ 100 SMS బెనిఫిట్స్ 28 రోజులు అందిస్తుంది.

Also Read: iPhone 17 Flipkart Deal: లేటెస్ట్ ఐఫోన్ పై రిపబ్లిక్ డే సేల్ బిగ్ డీల్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

జియో రూ. 450 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను కొత్తగా జియో విడుదల చేసింది. ఎక్కువ రోజులు చెల్లుబాటుతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 36 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. అంటే, అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా మరియు డైలీ 100SMS ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో కూడా 18 నెలల జెమినీ Ai ప్రో యాక్సెస్ ఉచితంగా అందిస్తుంది.
జియో రూ. 103 ఫ్లెక్సీ ప్యాక్

ఇది డేటా వోచర్ మరియు OTT లాభాలు కూడా జతగా తీసుకువస్తుంది. ఇది 28 రోజులకు గాను మొత్తం 5 జీబీ హై స్పీడ్ డేటా తీసుకొస్తుంది. అంతేకాదు, ఈ డేటా ప్యాక్ తో OTT కోసం మై జియో యాప్ లో ఒక వోచర్ కూడా అందిస్తుంది. ఇందులో మీరు OTT లాభాలు పొందవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :