మీ మొబైల్ నంబర్ BSNL కి మార్చుకోవాలా..!!

HIGHLIGHTS

పాత రేట్లకే తమ ప్లాన్ లను అఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీగా BSNL

రేట్లు పెరిగిన తరువాత మొబైల్ నంబర్ మెయింటైన్ చేయడం చాలా భారంగా మారింది

BSNL నెట్వర్క్ కి మారాలనుకునేవారు చాలా సింపుల్ గా పోర్ట్ చేసుకోవచ్చు

ఇప్పటికి పాత రేట్లకే తమ ప్లాన్ లను అఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీగా BSNL మాత్రమే నిలుస్తుంది. రీఛార్జ్ రేట్లు పెరిగిన తరువాత మొబైల్ నంబర్ మెయింటైన్ చేయడం చాలా భారంగా మారింది. అందుకే, తక్కువ తక్కువ ధరకే బెస్ట్ ప్లాన్స్ అఫర్ చేస్తున్న BSNL నెట్వర్క్ కి మారాలనుకునేవారు చాలా సింపుల్ గా పోర్ట్ చేసుకోవచ్చు. అయితే, ఆశించిన స్థాయిలో సిగ్నల్ మరియు ఇంటర్నెట్ ను పొందలేక పోతున్నట్లు BSNL కస్టమర్లు చెబుతున్నారు. అయితే, ఇది అన్ని ప్రాంతాలకు కాకపోవచ్చు.

కానీ, గతంలో 'How To Port My Mobile Number To BSNL' అనేది ఎక్కువగా సెర్చ్ చేస్తున్న విషయంగా చర్చలోకి వచ్చింది. మరి ఇదే విషయం గురించి మీరు కూడా తెలుసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ క్రింద సూచించిన విధంగా చేయండి. ఇలా చేస్తే ఒక వారం లోపలే మీ మొబైల్ నంబర్ ను BSNL కు పోర్ట్ చేసుకోవచ్చు.

మీ సిమ్ కార్డ్ ను BSNL కు ఎలా పోర్ట్ చేయాలి?

మీరు పోర్ట్ చేయదలచిన SIM కార్డు నుండి 1900 కి PORT అని టైప్ చేసి కొంచెం స్పెస్ ఇచ్చి మీ మొబైల్ నంబర్ ను టైప్ చేసే పంపించాలి. అంటే, PORT 0123456789 ఈ ఫార్ మ్యాట్ లో 1900 కి మెసేజ్ పంపించాలి. తరువాత, మీరు ఎంటర్ చేసి పంపిన మోబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది. అదే, UPC Code (యూనిక్ పోర్టింగ్ కోడ్) వస్తుంది. తరువాత, మీకు వచ్చిన పోర్టింగ్ నంబర్ ను మీ దగ్గరలోని BSNL సెంటర్ లేదా SIM స్టోర్‌లో చూపిస్తే అక్కడ మీకు కొత్త SIM ను అందచేస్తారు.

అయితే, దీనికోసం మీరు మీ ప్రూఫ్ జిరాక్స్ ను సమర్పించ వాల్సి ఉంటుంది. ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ వంటి ప్రభుత్వ అనుమతి పొందిన పత్రాలలో దేనినైనా మీరు ఇవ్వవచ్చు. మీరు వివరాలు అందించిన తరువాత రెండు లేదా మూడు రోజుల్లో మీ నంబర్ పాత నెట్వర్క్ నుండి డీ-యాక్టివేట్ అవుంతుంది మరియు BSNL నెట్వర్క్ లోకి యాక్టివేట్ చేయబడుతుంది. తరువాత, మీరు మీ అవసరానికి అనువైన BSNL ప్లాన్స్ ను ఎంచుకుని రీఛార్జ్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :