భారీ డిస్కౌంట్ తో 40 వేల ధరకే 65 ఇంచ్ QLED Smart Tv పొందండి.!

HIGHLIGHTS

భారీ డిస్కౌంట్ తో 40 వేల ధరకే 65 ఇంచ్ QLED Smart Tv పొందండి

ఈరోజు అందించిన బిగ్ ఆఫర్లతో పెద్ద స్మార్ట్ టీవీ సగం ధరకే లభిస్తోంది

పెద్ద స్మార్ట్ టీవీని చవక ధరలో కొనాలని చూస్తున్న వారికి బెస్ట్ డీల్

భారీ డిస్కౌంట్ తో 40 వేల ధరకే 65 ఇంచ్ QLED Smart Tv పొందండి, అని ఫ్లిప్ కార్ట్ అంటోంది. ఈరోజు అందించిన బిగ్ ఆఫర్లతో పెద్ద స్మార్ట్ టీవీ సగం ధరకే లభిస్తోంది. పెద్ద స్మార్ట్ టీవీని చవక ధరలో కొనాలని చూస్తున్న వారికి బెస్ట్ డీల్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది.

65 ఇంచ్ QLED Smart Tv డీల్

మోటోరోలా ఎన్ విజన్ X సిరీస్ నుంచి అందించిన 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (65UHDGQMBSGQ) ఈరోజు 69% భారీ డిస్కౌంట్ తో రూ. 42,999 రూపాయల ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC డెబిట్ కార్డ్ మరియు Citi-branded క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో ఈ ఫోన్ కొనే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ ఆఫర్లతో ఈ మోటోరోలా స్మార్ట్ టీవీని రూ. 40,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ పైన మరిన్ని ఇతర ఆఫర్లను కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది.

Also Read: చవక ధరలో 200 గంటల ప్లే టైమ్ మరియు రివర్స్ ఛార్జింగ్ తో కొత్త బడ్స్ తెచ్చిన pTron

MOTOROLA EnvisionX ఫీచర్లు

ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ Dolby Vision మరియు HDR 10 సపోర్ట్ కలిగిన 65 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ పైన పెద్ద సైజులో మంచి విజువల్స్ ను చూడవచ్చు. ఈ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

QLED Smart Tv

ఈ టీవీ లో కనెక్టివిటీ పరంగా, HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీలో 24W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ లో Dolby Atmos మరియు Dolby Digital సపోర్ట్ తో పాటు 4 సౌండ్ మోడ్స్ తో వస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 40 వేల బడ్జెట్ ధరలో వచ్చే బెస్ట్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ గా చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :