BSNL Super Offer: మరో వారంలో క్లోజ్ అవబోతున్న ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫర్ మిస్ అవ్వకండి.!

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం రీసెంట్ గా ఒక అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది

అదనంగా 14 రోజుల అదనపు వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ లాభాలు పొందుతారు

ఇది కేవలం ఒక ప్రీపెయిడ్ ప్లాన్ పైన మాత్రమే అందించింది

BSNL Super Offer: ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తన యూజర్ల కోసం రీసెంట్ గా ఒక అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ తో యూజర్ యూజర్లు వారు చేసే రీఛార్జ్ పై అదనంగా 14 రోజుల అదనపు వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ లాభాలు పొందుతారు. అయితే, ఇది కేవలం ఒక ప్రీపెయిడ్ ప్లాన్ పైన మాత్రమే అందించింది మరియు ఇది కేవలం లిమిటెడ్ పీరియడ్ టైం కోసం మాత్రమే అందించిన ఆఫర్. అందుకే, మరో వారంలో క్లోజ్ అవబోతున్న ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫర్ మిస్ అవ్వకండి.

BSNL Super Offer: ఏమిటి ఈ ఆఫర్?

బిఎస్ఎన్ఎల్ ఒక దీర్ఘ కాలిక ప్రీపెయిడ్ ప్లాన్ పై అదనపు వాలిడిటీ మరియు ఇతర ఆఫర్లను జత చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అదే బిఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్ గురించి. అయితే, ఈ అదనపు వాలిడిటీ మరియు ఇతర లాభాలు కేవలం మార్చి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇంతకీ ఏమిటా ఆఫర్ ప్లాన్ అనుకుంటున్నారు కదా, అదే బిఎస్ఎన్ఎల్ రీసెంట్ గా అందించిన రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్. ఈ ప్లాన్ పై బిఎస్ఎన్ఎల్ అందించిన అదనపు ఆఫర్లు మరియు ఈ ప్లాన్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

BSNL Rs. 997 Plan : బెనిఫిట్స్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ ఇటీవల బిఎస్ఎన్ఎల్ అందించిన బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లో ఒకటిగా నిలుస్తుందని కస్టమర్లు చెబుతారు. ఎందుకంటే, ఇది వెయ్యి రూపాయల కంటే తక్కువ రీఛార్జ్ తో 5 నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. అంటే, నెలకు కేవలం రూ. 200 రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు. అయితే, బిఎస్ఎన్ఎల్ కొత్తగా ఈ ప్లాన్ పై అందించిన ఆఫర్ తో 14 రోజుల అదనపు వాలిడిటీ మరియు అన్లిమిటెడ్ లాభాలు జత చేసింది.

ఇక ప్రీపెయిడ్ ప్లాన్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ వివరాల్లోకి వెళితే, ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ కొత్తగా అందుకున్న ఆఫర్ తో 150 రోజులు మరియు 14 రోజుల ఉచిత అదనపు వ్యాలిడిటీ తో టోటల్ 164 డేస్ వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ కలిగిన 164 రోజుల వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. కేవలం కాలింగ్ మాత్రమే కాదు రోజుకి 2GB హై స్పీడ్ డేటా మరియు ఈ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. ఇది కాకుండా డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా ఈ ప్లాన్ తో అందిస్తుంది.

Also Read: లేటెస్ట్ QLED Smart Tv పై అమెజాన్ భారీ డీల్స్ అందుకోండి.!

అయితే, పైన తెలిపిన 14 రోజుల అదనపు ఉచిత వాలిడిటీ కేవలం మార్చి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, ఈ అదనపు ప్రయోజనాలు అందుకోవాలని అనుకుంటే మార్చి 31వ తేదీ లోపు ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఒక వారం రోజుల్లో ముగియనున్న ఈ అద్భుతమైన ఆఫర్ ని బిఎస్ఎన్ఎల్ యూజర్లు మిస్ చేసుకోకండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :