రోజువారీ 5GB డేటాతో Jio.. షాక్కిచింది

HIGHLIGHTS

ఇప్పుడు జియో 1076 GB ప్రమోషన్లతో వచ్చింది

ఇప్పుడు జియో కోత్త ఆఫర్ని ప్రకటించింది తన Jio Link చందాదారుల కోసం. అయితే ఇది ఇంకా అమలులోకి రాలేదు, ఇంకా ప్రయోగదశలోనే ఉంది ఇది త్వరలో అచరణలోకి రానుంది.ఈ ప్లాన్ ద్వారా రోజువారీ 5GB డేటా అందనుంది చందాదారులకు.

ఈ కొత్త ప్యాకేజి మీకు రూ . 699, రూ . 2099 మరియు రూ . 4,199 ధరలతో తేనుంది. అయితే,పైన తెలిపిన అన్ని ప్లాన్స్ కూడా రోజువారి 5GB డాటాతో వస్తాయి వాటి చెబతులో మాత్రమే మార్పుంటుంది.ఈ ప్లన్స్ తో వాయిస్ కాలింగ్ కి మాత్రం ప్రాప్యత లేదు.

ఇంకా దీనికి అదనంగా, రూ . 699 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు దీనితో రోజువారీ 5GB డేటా తో పాటుగా ఒక 16GB ల అదనపు డేటాని కూడా పొందుతారు . అంటే 28 చెల్లుబాటుతో మొత్తంగా 156GB ల డేటా పొందుతారు నెల మొత్తానికి.  రూ . 2,099 ప్లాన్ తో 98 రోజుల చెల్లుబాటుతో వచ్చే డైలీ 5GB డేటా తో పాటుగా అదనంగా 48GB ల డేటా ని అందుకుంటారు. అంటే, 98 రోజులకి మొత్తంగా 538 GBల 4G స్పీడ్ డేటాని వాడుకునే అవకాశం పొందుతున్నారు.  చివరిగా,  రూ . 4,199 ప్లాన్ మీకు డైలీ డేటాతో పాటుగా 96GB ల 4G స్పీడ్ డేటాతో మొత్తం 1076 GBల డేటా 196 రోజుల చెల్లుబాటుతో తీసుకువస్తుంది. రోజువారీ 5GB డేటా వాడుక తరువాత వీటి వేగం 64 Kbps కి తగ్గించబడుతుంది.

రిలయన్స్ జియో పైన తెలిపి ప్లాన్స్ రానున్న నెలలో మన ముందుకు తీసుకురావచ్చు.          

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :