BSNL Best Prepaid plan with 150 days validity data Unlimited call
BSNL: యావత్ టెలికాం ఇండస్ట్రీలో అత్యంత చవకైన వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ ఎవరు ఆఫర్ చేస్తున్నారు? అని అడిగితే ఎవరైనా సరే తడుముకోకుండా చెప్పే సమాధానం మాత్రం ఒక్కటే అది ‘బిఎస్ఎన్ఎల్’ అని. ఎందుకంటే, కేవలం నెలకు రూ. 100 కంటే తక్కువ ఖర్చుతోనే బిఎస్ఎన్ఎల్ అందించే ఒక వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇందుకు కారణం. ఇది మాత్రమే కాదు అన్ని టెలికాం కంపెనీలు కూడా వారి టారిఫ్ రేట్లు పెంచుతుంటే, బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా అదే పాత రేట్లకు తన ప్రీపెయిడ్ ప్లాన్లు ఇంకా ఆఫర్ చేస్తోంది.
బిఎస్ఎన్ఎల్ యొక్క అత్యంత చవకైన వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 1,198 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ టెలికాం ఇండస్ట్రీలో అత్యంత చవకైన వన్ ఇయర్ ఈ ప్లాన్ గా నిలుస్తుంది. ఇంత తక్కువ ధరలో మరే ఇతర టెలికాం కంపెనీ కూడా వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ ను ఆఫర్ చేయడం లేదు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం అమౌంట్ ను 12 నెలలకు విభజిస్తే నెలకు కేవలం రూ. 100, రూపాయల కంటే తక్కువే అవుతుంది. అయితే, ఈ బెస్ట్ బడ్జెట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ కాలింగ్, డేటా మరియు SMS వంటి అన్ని ప్రయోజనాలు అందిస్తుంది.
Also Read: Realme P3 Ultra 5G: బడ్జెట్ ధరలో డబుల్ పెర్ఫార్మెన్స్ అందించే ఫీచర్స్ అందిస్తుందట.!
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ వ్యాలిడిటీ 365 రోజులే అయినా ఈ పాన్ అందించే ప్రయోజనాలు మాత్రమే నెల వారీగా అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు ప్రతినెలా 300 నిముషాల మినిట్స్ కాలింగ్, 3GB డేటా మరియు 30 SMS లిమిట్ ను అందిస్తుంది. ఈ విధంగా 12 నెలల పాటు ప్రతినెలా అందిస్తుంది. ఈ లిమిటెడ్ ప్రయోజనాలు ముగిసిన తర్వాత యూజర్ కు రెగ్యులర్ ఛార్జ్ లు వర్తిస్తాయి.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అత్యంత చవకైన ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ అతి తక్కువ ఖర్చుతో మొబైల్ నెంబర్ కొనసాగించాలని కోరుకునే వారికి గొప్ప ఆప్షన్ అవుతుంది.