BSNL రూ.599 మరియు రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్లతో అన్లిమిటెడ్ లాభాలు

HIGHLIGHTS

ఈ ప్రణాళిక కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే అందుబాటులో వుంది.

ఈ రెండు ప్లానలలో చెప్పదగిన మార్పులు చేసింది.

లోకల్ మరియు STD కి కూడా అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు

కొత్త ప్లాన్లను తీసుకురావడంతో పాటుగా, ప్రస్తుతం అందుబాటులోవున్నప్రీపెయిడ్ ప్లాన్లలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ, తన వినియోగదారులకు మంచి ప్రయోజనాలను అందించడంలో, ప్రభుత్వరంగ టెలికం సంస్థ అయినటువంటి BSNL ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఇటీవల, BSNL తన వినియోగధారులకి  మంచి ప్రయోజాన్ని అందించడం కోసం తీసుకొచ్చిన రూ.599 మరియు రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్లతో అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తున్నది.    

BSNL రూ.599 ప్రయోజనాలు

BSNL యొక్క రూ.599 ప్రీపెయిడ్ ప్రణాళికతో, ప్రస్తుతం వారు వాడుతున్నప్రీపెయిడ్ ప్రణాళిక యొక్క వ్యాలిడిటీని, 6 నెలల వరకూ పెంచుకోవచ్చు. అంతేకాదు, ఇప్పటికే ఈ ప్లాన్ వాడుతున్నట్లయితే, మీకు కూడా ఇది వర్తిస్తుంది. ఆరునెలలకు గాను రూ. 599 ధరతో వుండే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను గనుక నెలకు విభజించి చూస్తే, ఒక నెలకు కేవలం 100 రూపాయలు మాత్రమే అవుతుంది. అలాగే, లోకల్ మరియు STD కి కూడా అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు మరియు 6 నెలల వ్యాలిడిటీతో వస్తుంది.

ఈ ప్రణాళిక కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే అందుబాటులో వుంది.    

BSNL రూ.899 ప్రయోజనాలు

ఈ రూ.899 ప్రీపెయిడ్ ప్రణాళికతో చాలా గొప్ప ప్రయోజనాలను అందిస్తోంది BSNL సంస్థ. ఎందుకంటే, ఈ ప్రణాళికతో లోకల్ మరియు STD రొమింగుతో కూడా అపరిమితంగా కాలింగ్ చేసుకోవచ్చు. అధనంగా, ఈ ప్లానుతో రోజువారీ 1.5GB డేటాని కూడా అందిస్తోంది మరియు రోజువారీ 50SMS లను కూడా పూర్తి వ్యాలిడిటీకి గాను అందుకుంటారు వినియోగదారులు. ఇక ఈ పూర్తి ప్రయోజనాలను 6నెలల చెల్లుబాటుతో అందిస్తోంది. అయితే, BSNL సేవలు ఢిల్లీ మరియు ముంబాయి లో లేవు కాబట్టి, ఇక్కడ మీకు సేవలు వర్తించవు.     

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :