BSNL యొక్క కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలకు మాత్రమే అందుబాటు

HIGHLIGHTS

ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఆపరేటర్ ఒక కొత్త Rs.1312 రూపాయల కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ని తీసుకొచ్చింది.

ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఆపరేటర్ ఒక కొత్త1312 రూపాయల కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ని తీసుకొచ్చింది.  ఇది పూర్తి 365 రోజులకుగాను,  తక్కువ ధరతో విడుదల చేశారు. గత సంవత్సరం, BSNL తీసుకొచ్చినటువంటి వార్షిక ప్లాన్స్ అయినటువంటి రూ. 1699 మరియు రూ. 2099 ప్లాన్స్ వంటి మరొక నూతన వార్షిక ప్రణాళికలను కూడా ప్రారంభించింది. బిఎస్ఎన్ఎల్, ముందుగా ప్రారంభించిన గత రెండు వార్షిక పథకాలతో పోలిస్తే ఇది మంచి పధకం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ పథకం కింద, BSNL రోమింగుతో సహా 24 గంటల ఉచిత స్థానిక మరియు ఎస్టీడీ కాల్స్ అందిస్తోంది. అయితే, ఈ BSNL ప్లానులో అనేక పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్లాన్ ఢిల్లీ మరియు ముంబైల తప్ప మిగిలిన ఇతర అన్ని సర్కిళ్లకు కాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.   

BSNL ఈ సర్కిళ్లలో కార్యకలాపాలను కలిగి లేక పోవడమే కారణం.  అయినప్పటికీ, ఈ ప్లాన్ మొత్తంగా 365 రోజులకు గాను  5GB డేటాను కలిగి ఉంటుంది. ఎక్కువగా డేటాను ఉపయోగించని చందాదారులకు ఈ ప్లాన్ సరిపోతుంది.  ఎక్కువగా, కేవలం కాల్స్ కోసం ఒక ప్లాన్ తీసుకోవాలని కోరుకునేవారికి, ఇది కచ్చితంగా ఒక మంచి ప్లాన్.

అదనంగా, ఈ కొత్త రూ 1312 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లో చందాదారులందరూలు పూర్తి విశ్వసనీయతతో 1000 SMS లను పూర్తి వ్యాలిడిటీ కాలానికి ఆస్వాదించగలరు. అంతేకాదు, వీటి తోపాటు అదనంగా ఈ పూర్తి సంవత్సరానికి గాను వినియోగదారుడు హలో ట్యూన్లను ఎంజాయ్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.     

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :