ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 395 రోజులు నిశ్చింతగా ఉండొచ్చు.!

ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 395 రోజులు నిశ్చింతగా ఉండొచ్చు.!
HIGHLIGHTS

ఈ ప్లాన్ రీఛార్జ్ తో మీరు 13 నెలలు అన్ని లాభాలను పొందవచ్చు

ఇతర ప్రయోజనాలను కూడా లిమిటెడ్ కాలానికి అఫర్ చేస్తోంది.

మీరు 395 రోజులు అన్ని ప్రయోజనాలను అందుకుంటారు కాబట్టి నిశ్చింతగా ఉండవచ్చు

దీర్ఘ కాలం వ్యాలిడిటీ తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మరియు మరిన్ని ఇతర లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ గురించి ఈరోజు చూడనున్నాము. ఈ కేటగిరిలో BSNLఖచ్చితంగా  ముందుంటుంది. ఎందుకంటే, బిఎస్ఎన్ఎల్ యొక్క బెస్ట్ లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే మీరు 395 రోజులు అన్ని ప్రయోజనాలను అందుకుంటారు కాబట్టి నిశ్చింతగా ఉండవచ్చు. మరి బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు దాని వివరాలను చూద్దామా. 

మనం మాట్లడుకుంటోంది BSNL రూ. 2,399 రూపాయల లాంగ్  ప్లాన్ గురించే. ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ హెవీ డేటాతో సహా అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. 

BSNL Rs. 2,399

బిఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ మీకు 395 రోజుల వ్యాలిడిటీ ని అందిస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే, ఈ ప్లాన్ రీఛార్జ్  తో మీరు 13 నెలలు అన్ని లాభాలను పొందవచ్చు కాబట్టి నిశ్చింతగా ఉండవచ్చు. ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని తీసుకువస్తుంది. అంతేకాదు, డైలీ 2GB హై స్పీడ్ డేటా చొప్పున 395 రోజుల పాటు హై స్పీడ్ డేటా ని కూడా అందిస్తుంది. అలాగే, రోజుకు 100 SMS లిమిట్ చొప్పున 395 రోజుల sms ప్రయోజనాన్ని కూడా తీసుకువస్తుంది. 

ఈ BSNL Rs. 2,399 ప్లాన్ తో ఇతర ప్రయోజనాలను కూడా లిమిటెడ్ కాలానికి అఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే PRBT, Eros ఎంటర్టైన్మెంట్ యాక్సెస్ మరియు  Lokdhun ను 30 రోజుల లిమిట్ కాలానికి ఉచితంగా అఫర్ చేస్తోంది. 

మరిన్ని BSNL ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం CliCk Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo