BSNL: రూ.200 కంటే తక్కువ ధరకే అధిక లాభాలను అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్

HIGHLIGHTS

ఎక్కువ లాభాలను అందించే ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న టెలికం BSNL

స్టమర్లకు అధిక లాబాలను అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్

డేటా, కాలింగ్ మరియు మరిన్ని లాభాలను అందించే ప్లాన్స్

BSNL మాత్రమే అతితక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించే ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న టెలికంగా నిలుస్తుంది. మీ బడ్జెట్ కేవలం 200 రూపాయల కంటే తక్కువయినా కూడా మీకు మంచి ఆఫర్లే అందుబాటులో ఉన్నాయి. అంటే, కేవలం 200 రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే BSNL కస్టమర్లు లాంగ్ వ్యాలిడిటీ, డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ వంటి ప్రయోజనాలను అందుకోవచ్చు. BSNL కస్టమర్లకు అధిక లాబాలను అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో చూద్దాం.

BSNL రూ. 106 రీఛార్జ్ ప్లాన్

BSNL యొక్క రూ. 106 స్పెషల్ టారిఫ్ వోచర్ ఏకంగా 85 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు , ఈ వ్యాలిడిటీ కాలానికి గాను 3GB హై స్పీడ్ డేటా మరియు 100 మినిట్స్ ఉచిత లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత కాలింగ్ మినిట్స్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇక ఈ 100 మినిట్స్ ఉచిత కాలింగ్ లిమిట్ ముగిసిన తరువాత కాలింగ్ కోసం నిముషానికి 30 పైసలు చెల్లించాలి. అధనంగా, ఈ ప్లాన్‌ ద్వారా 60 రోజుల పాటు కాలర్ ట్యూన్ సర్వీస్ ను ఉచితంగా పొందవచ్చు.

BSNL రూ.197 ప్లాన్

BSNL యొక్క రూ.197 రీఛార్జ్ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, డైలీ 2GB హై స్పీడ్ డేటా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు  డైలీ 100SMS లాభాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే, ఈ ఉచిత ప్రయోజానాలన్ని కూడా కేవలం 18 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ వ్యాలీడీటీ మాత్రం 150 రోజులకు వర్తిస్తుంది. అంటే, BSNL కస్టమర్లు కేవలం 200 రూపాయల కంటే తక్కవ ఖర్చుతోనే 5 నెలల వ్యాలిడిటీని పొందవచ్చు. 

మరిన్ని BSNL ప్లాన్స్ మరియు రీఛార్జ్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :