BSNL super prepaid plan which offers complete benefits under rs 100 for month
BSNL: యూజర్లకు అతి చవక ధరలో ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తున్న టెలికాం కంపెనీ గా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మాత్రమే ముందంజలో ఉంది. ఇప్పటికే పెరిగిన ఖర్చులకు తోడు పెరిగిన మొబైల్ టారిఫ్ ధరలతో సతమవుతున్న యూజర్లకు బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ వరంగా మారాయి. అందుకే, ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకోండి. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే నెలకు రూ. 100 ఖర్చుతోనే అన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం చవక రేటుకే అందించిన రూ. 1,198 రూపాయల వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ ఈ లాభాలను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను బిఎస్ఎన్ఎల్ చాలా కాలంగా తన యూజర్లకు ఆఫర్ చేస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం అమౌంట్ ను నెల వారీగా లెక్కిస్తే నెలకు రూ. 100 రూపాయల కంటే తక్కువ ఖర్చు అవుతుంది.
BSNL రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రెగ్యులర్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మాదిరిగా కాకుండా నెల వారి లాభాలతో సంవత్సరం మొత్తం లాభాలను అందిస్తుంది. అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు నెల నెల కాలింగ్ మినిట్స్, డేట్ మరియు SMS లాభాలను 12 నెలలకు సమానంగా అందిస్తుంది.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు నెలకు మినిట్స్ కాలింగ్ మినిట్స్, నెలకు 3GB హై స్పీడ్ డేటా మరియు నెలకు 30 SMS ప్రయోజనాలు అందిస్తుంది. ఈ విధంగా 12 నెలలు ఇదే ప్రయోజనాలు అందిస్తుంది.
Also Read: Amazon Sale: 7 వేలకే Dolby Atmos సౌండ్ బార్ కావాలా..అయితే, ఈ డీల్ మిస్సవ్వకండి.!
ఇక ఈ పైన తెలిపిన ఉచిత ప్రయోజనాలు ముగిసిన తర్వాత లోకల్ కాల్ నిమిషానికి రూ. 1, STD కాల్ రూ. 1.3 పైసలు, వీడియో కాల్ కోసం రూ. 2, లోకల్ SMS కు 80 పైసలు, నేషనల్ SMS కోసం 1.20 పైసలు మరియు 1MB డేటా కి 25 పైసలు ఛార్జ్ లు వర్తిస్తాయి.
ప్రీపెయిడ్ ప్లాన్ చేయడానికి మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here