BSNL Super Plans which offers more benefits under lowest plan price
BSNL Super Plans: ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ నామమాత్రపు రేటుకే చాలా కాలం అధిక ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఎంచుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు తక్కువ ఖర్చుతో పొందవచ్చు. అయితే, మీ అవసరాన్ని ఈ ప్లాన్ ఎంచుకోవాలి. అంటే, డేటా ఎక్కువ అవసరం అయితే ఎక్కువ రేటు చెల్లించి లేదంటే కేవలం కాలింగ్ మరియు మినిమం డేటా కోరుకుంటే మరింత తక్కువ తక్కువ రేటు కలిగిన ప్లాన్ ఎంచుకోవచ్చు.
బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల ప్రయోజనార్ధం అనేక బడ్జెట్ ధరలో విడివిడిగా ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించింది. వీటిలో తక్కువ ధరలో ఎక్కువ లాభాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ యూజర్ అవసరాన్ని బట్టి ఎంచుకునే విధంగా ఉంటాయి. వాటిలో కాలింగ్ డేటా మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలు కలిగిన ప్లాన్స్ బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.
కాలింగ్ కోసం చవక ధరలో లభించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూసే బీఎస్ఎన్ఎల్ యూజర్లు రూ. 1,499 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 300 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం అందుకుంటారు. కేవలం కాలింగ్ మాత్రమే కాదు 30 రోజులకు గాను 32 జీబీ హై స్పీడ్ డేటా మరియు డైలీ 100SMS వినియోగ ప్రయోజనం కూడా అందుకుంటారు.
ఈ పరిధిలో రెండు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. వీటిలో రూ. 997 మరియు రూ. 1,999 రెండు ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి 150 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తే మరోకటి 330 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 150 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకుంటారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది.
Also Read: బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 25 వేల ధరలో లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
బీఎస్ఎన్ఎల్ రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ 330 రోజులు చెల్లుబాటు అవుతుంది. ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 330 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు పొందవచ్చు. ఈ ప్లాన్ తో 330 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 1.5 జీబీ డేటా మరియు డైలీ 100 SMS బెనిఫిట్స్ మీకు అందిస్తుంది.
గమనిక : ఇక్కడ తెలియచేసిన మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అన్లిమిటెడ్ డేటా తో వస్తాయి. హై స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని ఈ ప్లాన్స్ ఆఫర్ చేస్తాయి.