BSNL Super Plan: అధిక లాభాలు అందించే బిఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ రేపటితో క్లోజ్ అవుతుంది.!

Updated on 23-Feb-2026
HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ గత నెల ప్రత్యేకంగా విడుదల చేసిన లిమిటెడ్ పీరియడ్ ప్రీపెయిడ్ ప్లాన్ రేపటితో క్లోజ్ అవుతుంది

BSNL Super Plan సంవత్సరం మొత్తం అధిక డేటాతో పాటు అన్లిమిటెడ్ లాభాలు కూడా అందిస్తుంది

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే లాభాలు అందుకోవాలంటే కేవలం ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ ఉంది

BSNL Super Plan: కొత్త సంవత్సరం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ గత నెల ప్రత్యేకంగా విడుదల చేసిన లిమిటెడ్ పీరియడ్ ప్రీపెయిడ్ ప్లాన్ రేపటితో క్లోజ్ అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా సంవత్సరం మొత్తం అధిక డేటాతో పాటు అన్లిమిటెడ్ లాభాలు కూడా అందిస్తుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే లాబాలు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే లాభాలు అందుకోవాలంటే కేవలం ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ ఉంది. అందుకే, ఈ లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఈరోజు వివరంగా తెలుసుకోండి.

BSNL Super Plan: ఏమిటి ఈ ప్లాన్?

కొత్త సంవత్సరం కోసం బిఎస్ఎన్ఎల్ అందించిన రూ. 2,626 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను గత నెల అందించింది మరియు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఫిబ్రవరి 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రేపటితో ముగుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్లిమిటెడ్ లాభాలు పొందాలంటే, ఈరోజు మరియు రేపు మాత్రమే మీకు అవకాశం ఉంది.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను బిఎస్ఎన్ఎల్ భారత్ కనెక్ట్ 26 ప్లాన్ పేరుతో అందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ కేర్ యాప్ ద్వారా కూడా అందుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ ప్లాన్ వివరాలు తెలుసుకున్నారు, ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు తెలుసుకుందాం.

Also Read: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి Oppo K13 Turbo పై బిగ్ డీల్స్ ఆఫర్ చేస్తోంది.!

BSNL Super Plan: రూ. 2,626 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ. 2,626 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ డైలీ 2.6 జీబీ హై స్పీడ్ డేటా మరియు ఈ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 100 SMS బెనిఫిట్ కూడా రీఛార్జ్ చేసిన వారికి లభిస్తుంది.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఊరించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీచార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం అధిక డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు ఆనందించవచ్చు. మీరు కూడా బిఎస్ఎన్ఎల్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూసే యూజర్లు ఈ లిమిటెడ్ పీరియడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ను పరిశీలించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :