BSNL Super Plan which offers 30 days unlimited benefits at rs 1 closes tomorrow
BSNL Super Plan: బిఎస్ఎన్ఎల్ చాలా రోజులుగా కొనసాగిస్తూ వస్తున్న ఒక్క రూపాయి అన్లిమిటెడ్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది. ఈ ఆఫర్ తో కేవలం రూ. 1 రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు పొందవచ్చు. ఆగస్టు 2025 లో బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ను ప్రకటించింది మరియు ఈ ఆఫర్ ను కొత్త సంవత్సరంలో కూడా ముందు కొనసాగించింది. అయితే, ఈ సూపర్ ప్లాన్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది.
2025 సంవత్సరం ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రూ. 1 రూపాయికే అన్లిమిటెడ్ లాభాలు అందించే ఆజాదికా మహోత్సవ్ ఆఫర్ ను అందించింది. ఇదే ఆఫర్ ను బిఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ సందర్భంగా 2026 న్యూ ఇయర్ ఆఫర్ గా ప్రకటించింది అయితే, ఈ ఆఫర్ ను 1 జనవరి 2026 నుంచి 31 జనవరి 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంచింది. అంటే, బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ వన్ రూపీ వన్ మంత్ అన్లిమిటెడ్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది. కాబట్టి, బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ వన్ రూపీ ఆఫర్ అందుకోవాలంటే ఈరోజు మరియు రేపు మాత్రమే మీకు అవకాశం ఉంది.
Also Read: Jio Best Plans: నెలకు రూ. 300 ఖర్చుతోనే అన్లిమిటెడ్ అండ్ ఫ్రీ బెనిఫిట్స్ కూడా పొందండి.!
ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1 రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ తో 30 రోజుల అన్లిమిటెడ్ లాభాలు యూజర్లకు అందుతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఉచిత ఆఫర్ అని మనం చెప్పొచ్చు. ఈ ప్లాన్ తో మీరు రీఛార్జ్ చేస్తే మీకు 30 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందుతాయి. ఈ అన్లిమిటెడ్ లాభాల్లో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు ప్రతి రోజు 100 SMS వినియోగ ప్రయోజనం వంటి పూర్తి ప్రయోజనాలు అందిస్తుంది. మనం ఇప్పుడు చెప్పుకున్న అన్ని లాభాలు కూడా మీకు కేవలం ఒక్క రూపాయికే లభిస్తాయి.
అయితే, ఈ ఉచిత లాభాలు అందరికీ లభించవు. ఎందుకంటే, ఈ ఆఫర్ ను కేవలం కొత్త కస్టమర్ల కోసం మాత్రమే అందించింది. అంటే, బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకుని మొదటి రీఛార్జ్ చేసే యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్థిస్తుంది. ఆఫర్ పొందాలంటే మీరు కూడా బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు తీసుకుని రూ. 1 ఆఫర్ ప్లాన్ తో మొదటి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ అద్భుతమైన ఆఫర్ ను వెంటనే అందుకోండి.