BSNL Super Plan: చవక ధరలో భారీ డేటా అందించే అన్లిమిటెడ్ ప్లాన్ రేపటితో క్లోజ్ అవుతుంది.!

Updated on 12-Dec-2025
HIGHLIGHTS

అధిక డేటాతో రీసెంట్ గా అందించిన ఒక బడ్జెట్ అన్లిమిటెడ్ ప్లాన్ రేపటితో క్లోజ్ అవుతుంది

నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ ప్లాన్ ను అందించింది

ఈ ప్లాన్ రేపు ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది

BSNL Super Plan: బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అధిక డేటాతో రీసెంట్ గా అందించిన ఒక బడ్జెట్ అన్లిమిటెడ్ ప్లాన్ రేపటితో క్లోజ్ అవుతుంది. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ ప్లాన్ ను అందించింది. అయితే, ఈ ప్లాన్ ను కేవలం లిమిటెడ్ పీరియడ్ టైమ్ తో మాత్రమే అందించింది. ఈ ప్లాన్ లిమిటెడ్ పీరియడ్ గడువు రేపటితో ముగుస్తుంది. ఇది రేపు ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

BSNL Super Plan: ఏమిటి ఈ ప్లాన్?

ఏమిటి ఈ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ అనుకుంటున్నారా? బీఎస్ఎన్ఎల్ కొత్తగా అందించిన స్టూడెంట్ ప్రీపెయిడ్ ఆఫర్ గురించి మేము ఇప్పుడు చెబుతోంది. ఈ ప్లాన్ రూ. 251 రూపాయల రీఛార్జి తో వస్తుంది మరియు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ డిసెంబర్ 13వ తేదీ వరకు మాత్రమే బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ టైమ్ పీరియడ్ ను పెంచితే మాత్రం మళ్ళి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతానికి ఈ ప్లాన్ డేట్ పెంచే విషయం పై ఎటువంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు.

Also Read: boAt 5.1 Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ ఆఫర్స్ తో రూ. 11,999 ధరకే లభిస్తోంది.!

BSNL Super Plan: అందించే బెనిఫిట్స్ ఏమిటి?

బీఎస్ఎన్ఎల్ యొక్క రూ. 215 ప్రీపెయిడ్ 28 రోజులు చెల్లుబాటు అయ్యే అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ 28 రోజులకు గాను టోటల్ 100GB హై స్పీడ్ డేటా ఆఫర్ చేస్తుంది మరియు ఈ లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. ఇది కాకుండా ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు డైలీ 100SMS బెనిఫిట్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ మీరు అందుకోవాలంటే ఈ రోజు లేదా రేపు రీఛార్జ్ యూజర్లకు మాత్రమే లభిస్తుంది.

ఇక ఇలాంటి అధిక లాభాలు అందించే మరో ప్లాన్ కోసం చూస్తే, రూ. 225 రూపాయల ప్రీపెయిడ్ మీకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5 జీబీ హై స్పెయిడ్ డేటా, ఆ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేట్ అందిస్తుంది. ఇది కూడా బీఎస్ఎన్ఎల్ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా చెప్పబడుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :