BSNL రూ.899 ప్రీపెయిడ్ ప్లానులో మార్పు : ఇప్పుడు డబుల్ డేటా

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 20 Feb 2019
HIGHLIGHTS
  • రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్, పూర్తిగా 180 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

BSNL రూ.899 ప్రీపెయిడ్ ప్లానులో మార్పు : ఇప్పుడు డబుల్ డేటా
BSNL రూ.899 ప్రీపెయిడ్ ప్లానులో మార్పు : ఇప్పుడు డబుల్ డేటా

జనవరి నెలలో, BSNL ఒక కొత్త అర్ధ సంవత్సర ప్రీపెయిడ్ ప్లాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త ఆరునెలల ప్రీపెయిడ్ ప్లాన్ని రూ.899 ధరతో అందించింది. ఇది పూర్తి 180 రోజులకుగాను,  తక్కువ ధరతో విడుదల చేశారు. ముందుగా, ఈ రూ.899 ప్రణాళిక కింద, BSNL రోమింగుతో సహా అపరిమిత స్థానిక మరియు ఎస్టీడీ కాల్స్ అందిస్తోంది. ఈ ప్లాన్ రోమింగ్ పరిస్థితుల్లో ఢిల్లీ మరియు ముంబై తప్ప మిగిలిన ఇతర అన్ని సర్కిళ్లలో కాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ రూ.899 ప్రీపెయిడ్ ప్లానుతో, రోజువారి 1.5 GB డేటా వినియోగదారులకి లభిస్తుంది. అలాగే, ఈ పూర్తి వ్యాలిడిటీకి గాను అన్లిమిటెడ్ SMS (రోజుకు 50 మాత్రమే) వంటి ప్రయోజనాన్ని కూడా అందించింది.

అయితే, ఇప్పుడు ఈ రూ. 899 ప్లాన్ పైన 1.7 GB అధిక డేటాని ఉచితంగా అందిస్తోంది BSNL టెలికం సంస్థ. ఈ ప్లాన్ ద్వారా ఇప్పుడు వినియోగదారులు, రోజువారీ 3.2GB దాటని అందుకుంటారు. అంటే, ఇంతకముందు పూర్తి వ్యాలిడిటీకి గాను మొత్తంగా 270GB డేటాని అందిస్తుండగా ఇప్పుడు మొత్తంగా 576GB డేటాని అందిస్తుంది తన వినియోగదారులకి.   

BSNL యొక్క ఈ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్, పూర్తిగా 180 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రోమింగ్ తో సహా అపరిమిత కాలింగ్ మరియు రోజువారీ 50 SMS మరియు రోజు వారి 3.2GB డేటా ప్రయోజనాన్ని తీసుకొస్తుంది ఇప్పుడు వినియోగదారులకి.     

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status