bsnl rs 1 rupees unlimited 30 days offer closes tomorrow
BSNL రూ. 1 అన్లిమిటెడ్ 30 డేస్ ఆఫర్ రేపటితో క్లోజ్ అవుతుంది. ఆగస్టు నెలలో ప్రారంభించిన 1 రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ నవంబర్ 15వ తేదీతో ముగుస్తుంది. 28 రోజుల రీఛార్జ్ కోసం కనీసం రూ. 300 రూపాయలైనా ఖర్చు చేయాల్సి వచ్చే ఈరోజు కేవలం ఒక్క రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు. 2025 ఆగస్టు 15 సందర్భంగా బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ప్లాన్ అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్ గా నిలిచింది మరియు ఈ ఆఫర్ రేపటితో ముగుస్తుంది.
కొత్త యూజర్లను సమీకరించే ప్లాన్ లో భాగంగా బీఎస్ఎన్ఎల్ అందించిన కొత్త ఆఫర్ ఇది. ఈ ఆఫర్ ను ఆగస్టు నెల నుంచి బీఎస్ఎన్ఎల్ కోసాగిస్తూ వస్తోంది. అయితే, ఈ ఆఫర్ గడువు తేదీ నవంబర్ 15 వరకు మాత్రమే అని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అంటే, ఈ ప్లాన్ ఆఫర్ రేపటితో క్లోజ్ అవుతుంది. ఇది కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెంబర్ తీసుకునే వారికి మాత్రమే లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ పొందాలంటే మీరు బీఎస్ఎన్ఎల్ యొక్క కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలి.
దేశంలో సరైన నెట్ వర్క్ లేని టెలికాం కంపెనీ గా బీఎస్ఎన్ఎల్ ఒకప్పుడు యూజర్ల నుంచి అనేక కంప్లైంట్ లను అందుకుంది. అయితే, ఇప్పుడు ఆ సమస్య లేకుండా TATA వంటి ప్రైవేట్ కంపెనీలతో దేశవ్యాప్తంగా లక్ష కంటే ఎక్కువ టవర్లు నిర్మించింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4G నెట్ వర్క్ మరియు విస్తరించిన టవర్స్ తో గొప్ప సేవలు అందిస్తోంది.
Also Read: టాప్ రేటెడ్ Dolby QLED స్మార్ట్ టీవీ పై టాప్ డీల్స్ అందించిన అమెజాన్.!
బీఎస్ఎన్ఎల్ రూ. 1 ఆఫర్ ప్లాన్ తో 30 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందుతాయి. కొత్త సిమ్ కార్డు తీసుకుని ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లకు ఈ ప్రయోజనాలు అందుతాయి. ఈ ప్లాన్ తో 30 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, రోజు 2GB హై స్పీడ్ డేట్ చొప్పున నెల రోజులకు 60 జీబీ డేటా మరియు రోజుకు 100 SMS బెనిఫిట్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ మీరు కూడా అందుకోవాలంటే ఈరోజు మరియు రేపు మాత్రమే మీకు ఛాన్స్ ఉంటుంది.
కేవలం ఈ ప్లాన్ మాత్రమే కాదు బీఎస్ఎన్ఎల్ మరిన్ని చవక ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఆఫర్ చేస్తోంది. కొత్త నెంబర్ ను కొనసాగించడానికి మీకు అనువైన మరిన్ని ప్లాన్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి.