BSNL రూ. 98 ప్రీపెయిడ్ ప్లానులో మార్పులు : ఇప్పుడు రోజుకు 2GB డేటా, Eros Now ఉచిత సబ్ స్క్రిప్షన్

HIGHLIGHTS

BSNL తన 98 రూపాయల పైన అధిక డేటా అందించనున్నట్లు అధికారికంగా తెలిపినది.

గత నెలలో,  ప్రభుత్వ టెలికం సంస్థ అయిన, బిఎస్ఎన్ఎల్ దాని భారత్ ఫైబర్ సర్వీసును ప్రకటించింది. అంతేకాకూండా , ఈ గృహ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు రోజువారీ డేటాను అందిస్తునట్లు కూడా ప్రకటించింది.  ఈ సేవను పొందటానికి వినియోగదారుడు ఎంచుకునే విధంగా, అపరిమిత ఇంటర్నెట్ ప్లాన్లకు  ఈ ప్రభుత్వ-రంగ టెలికాం కొన్ని కొత్త మార్పులను చేయడమేకాకుండా, ఒక సంవత్సరం అమేజాన్ ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక ఇప్పుడు మరొక ప్రకటన చేసి అందరి మనసులను దోచుకుంది. ఏమిటి ఆ ప్రకటన, అనుకుంటున్నారా? అదేమిటంటే, BSNL యొక్క98 రూపాయల ప్రీపెయిడ్ రీచార్జి ప్లాను పైన దాకా డేటా అందించడమేకాకుండా, Eros యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అఫర్ చేస్తోంది. ముందుగా ఈ రూపాయల ప్రీపెయిడ్ ప్లానుతో రోజువారీ 1.5GB డేటా అందిస్తుండగా, ఇప్పుడు దీనిపైన 0.5GB అధిక డేటా కలిపి రోజుకు 2GB దాటని అందించనున్నట్లు ప్రకటించింది.     

ఈ 98 రుపాయల ప్రీపెయిడ్ ప్లానులో కేవలం డేటాని మాత్రమే పెంచలేదు, అధనంగా Eros Now యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. నిజానికి, ఈ Eros Now సబ్ స్క్రిప్షన్ కోసం నెలకి 49 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, కానీ దీన్ని ఈ ప్లానుతో ఉచితంగా అందిస్తోంది, BSNL. అయితే, ఈ Eros Now ఉచిత సబ్ స్క్రిప్షన్,  ప్లాను వ్యాలిడిటీ ఉన్నంత కలం మాత్రమే చెల్లుతుంది. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది కూడా సవరించిన, ఈ ప్లానుతో వచ్చింది. అదేమిటంటే, ఇంతకుముందు 26 రోజుల చెల్లుబాటులో వచ్చిన ఈ ప్లాన్ ఇప్పుడు 24 రోజులకు తగ్గించబడింది.                    

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :