భారీ షాకిచ్చిన BSNL..ఈ ప్లాన్స్ వ్యాలిడిటీలో కోత విధించింది.!

HIGHLIGHTS

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన యూజర్లకు భారీ షాకిచ్చింది

BSNL బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ల వ్యాలిడిటీలో కొత్త విధించింది

యూజర్ల మనసు చోరగున్న నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన యూజర్లకు భారీ షాకిచ్చింది. అతితక్కువ ధరలో అధిక వ్యాలిడిటీ అఫర్ చేస్తున్న వెలుగొందుతున్న BSNL, ఇప్పుడు తన కస్టమర్లకు అఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ల వ్యాలిడిటీలో కొత్త విధించింది. ఇందులో, బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా యూజర్ల మనసు చోరగున్న నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. మరి BSNL కొత్తగా చేసిన మార్పులు మరియు వాటి ఎఫెక్ట్ పడిన ప్లాన్స్ ఏమిటో చూద్దామా. 

BSNL చాలా కాలంగా అఫర్ చేస్తున్న రూ.107, రూ.197, రూ.397 మరియు రూ.797 బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్  కాలంలో మార్పులు చేసినట్లు ప్రకటించి, అందరిని ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి, ఈ ప్లాన్స్ అన్ని కూడా వ్యాలిడిటీ పరంగా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కానీ, ఇప్పుడు వ్యాలిటీ కాలం చాలా వరకూ తగ్గించబడ్డాయి. ప్లాన్ వివరాలను క్రింద చూడవచ్చు.   

BSNL Rs.107 Plan:

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో రూ.107 ప్లాన్ కూడా ఒకటి. నిన్నటి వరకు ఈ ప్లాన్ కేవలం 107 రూపాయలకే 40 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేసేది. అయితే, ఇప్పుడు ఈ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తుంది. అంటే,వ్యాలిడిటీ 5 రోజులు తగ్గించబడింది.  ఈ ప్లాన్ తో 200 మినిట్స్ ఉచిత కాలింగ్ మినిట్స్ ను కూడా అందిస్తున్నది. అంతేకాదు, పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 3GB డేటా కూడా అందుతుంది. ఈ ఫ్రీ బైస్ ముగిసిన తరువాత మీకు కాల్ మరియు డేటా రేట్లు వర్తిస్తాయి. 

BSNL రూ.197 ప్లాన్:

BSNL యొక్క రూ.197 ప్రీపెయిడ్ ప్లాన్ ముందుగా 85 రోజుల వ్యాలిడిటీ వచ్చేది. అయితే, ఈ ప్లాన్ తో ఇప్పుడు ఈ ప్లాన్ కేవలం 70 రోజుల వ్యాలిడిటీని మాత్రమే  అఫర్ చేస్తోంది. అయితే, డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం కూడా అందుతుంది. అలాగే, డైలీ 100SMS మరియు Zing ప్రయోజనం కూడా అందుతుంది. ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న డేటా, కాలింగ్ మరియు SMS ఉచిత ప్రయోజనాలు కేవలం 15 రోజులకు మాత్రమే అందుతాయి. వ్యాలిడిటీ మాత్రం 70 రోజులు అని గుర్తుంచుకోండి. 

BSNL రూ.397:

ఈ రూ.397 తో BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే  పూర్తి 180 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేసేది. అయితే, ఈ ప్లాన్ వ్యాలిడిటీని ఇప్పుడు 30రోజులు తగ్గించి కేవలం 150 రోజులకు కుదించింది. వాస్తవానికి, ముందు నుండి అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా కొనియాడబడేది.  ఇక డేటా విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో మీకు రోజూ 2GB హై స్పీడ్ డేటా అందించబడుతుంది. అయితే, ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 30 రోజులకు వరకూ మాత్రమే వర్తిస్తాయి. అంటే, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 ఉచిత SMS మరియు 2GB హై స్పీడ్ డేటా లాభాలు మీకు కేవలం 60 రోజులు మాత్రమే అందుతాయి. 

BSNL రూ.797:

ఇక చివరిగా BSNL యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చూస్తే, ఈ ప్లాన్ ముందుగా 365 రోజుల వ్యాలిడిటీ కలిగివుండేది. అయితే, BSNL ఇప్పుడు ఈ ప్లాన్ తో కేవలం 300 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తోంది. అయితే, ఇతర ప్రయోజనాలతో ఎటువంటి మార్పులు చెయ్యలేదు. అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఉచిత SMS, మరియు రోజూ 2GB హై స్పీడ్ డేటా ఈ ప్లాన్ తో అందించబడుతుంది. 

అయితే, ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు వరకూ మాత్రమే వర్తిస్తాయి. అంటే, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 ఉచిత SMS మరియు 2GB హై స్పీడ్ డేటా లాభాలు మీకు కేవలం 60 రోజులు మాత్రమే అందుతాయి. కానీ, వ్యాలిడిటీ మాత్రం పూర్తిగా 300 రోజులకు వర్తిస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :