BSNL గుడ్ న్యూస్: ఈ ప్లాన్స్ పైన అధనపు వ్యాలిడిటీ ప్రకటించింది.!

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం గుడ్ న్యూస్ అందించింది

ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన అదనపు వ్యాలిడిటీని జత చేసింది

ఈ కొత్త ఆఫర్ తో ఈ ప్లాన్స్ ఎక్కువ రోజులు చెల్లుబాటు అవుతాయి

ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యూజర్ల కోసం గుడ్ న్యూస్ అందించింది. బిఎస్ఎన్ఎల్ ముందు నుంచి ఆఫర్ చేస్తున్న రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన అదనపు వ్యాలిడిటీని జత చేసింది. ఈ కొత్త ఆఫర్ తో ఈ ప్లాన్స్ ఎక్కువ రోజులు చెల్లుబాటు అవుతాయి.

BSNL గుడ్ న్యూస్

ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), ఒక రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన అదనపు వ్యాలిడిటీని అందించింది. బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.699 మరియు రూ. 999 రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన ఈ గొప్ప ప్రయోజనాన్ని అందించింది. బిఎస్ఎన్ఎల్ కొత్తగా జతచేసిన ఈ వ్యాలిడిటీ తర్వాత ఈ రెండు ప్లాన్ ఎటువంటి ప్రయోజనాలు అందిస్తున్నాయో చూద్దాం.

బిఎస్ఎన్ఎల్ రూ. 699 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క PV699 ప్లాన్ ఇప్పటివరకు 130 రోజుల వ్యాలిడిటీ మాత్రమే కలిగి ఉంది. అయితే, బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ పైన 20 రోజులు అధనపు వాలిడిటీని జత చేసింది. దీనితో ఈ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

BSNL PV699 Plan

ఇక ఈ ప్లాన్ అందించే ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ 150 రోజులకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. అంతేకాదు, ఈ డైలీ 0.5 GB కూడా అందుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్ తో డైలీ 100SMS ఉపయోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.

Also Read: Vivo T3 5G: వివో అప్ కమింగ్ ఫోన్ మెయిన్ ఫీచర్స్ ఇవేనట.!

బిఎస్ఎన్ఎల్ రూ. 999 ప్లాన్

ఇక బిఎస్ఎన్ఎల్ యొక్క PV699 ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ ఇప్పటి వరకూ 200 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందించేది. ఈ ప్లాన్ పైన కూడా బిఎస్ఎన్ఎల్ 15 రోజుల అదనపు వాలిడిటీని ప్రకటించింది. ఇప్పుడు ఈ ప్లాన్ మొత్తం 215 రోజులువ్యాలిడిటీని అందిస్తుంది.

BSNL PV999 Plan

ఈ ప్లాన్ ఇతర ప్రయోజనాల విషయానికొస్తే, ఈ ప్లాన్ 215 రోజులు పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. కానీ ఈ ప్లాన్ తో డేటా లేదా SMS వంటి బెనిఫిట్స్ మాత్రం ఉండవు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :