BSNL new Diwali offer announced with unlimited benefits
BSNL ధమాకా ఆఫర్: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ కొత్త కొత్త ఆఫర్స్ ప్రకటిస్తూ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు కొనసాగుతుంది. దేశం మొత్తం 4జి నెట్వర్క్ లాంచ్ చేసి మంచి సర్వీస్ ఆఫర్ చేయడానికి పూనుకున్న బీఎస్ఎన్ఎల్, దీపావళి సందర్భంగా బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం తక్కువ ఖర్చుతో 330 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ఆఫర్ కూడా ఇప్పుడు అనౌన్స్ చేసింది.
2025 దీపావళి పండుగ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం ఈ కొత్త ఆఫర్ ని ప్రకటించింది. ఆఫర్ ఏమిటంటే, బీఎస్ఎన్ఎల్ ముందు నుంచి ఆఫర్ చేస్తున్న లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 1,999 పై ఇప్పుడు అధిక లాభాలు అందించింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు రీఛార్జ్ MRP లో 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అయితే, ఇందులో 2.5% మీకు మరియు 2.5% జనహిత ప్రయోజనార్ధం అవసరమైన పనులకు ఖర్చు పెడుతుంది.
అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు రూ. 50 రూపాయలు తిరిగి పొందడమే కాకుండా రూ. 50 సమాజం కోసం చేసే మంచి పనుల కోసం ఇచ్చిన వారవుతారు. బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ని అక్టోబర్ 18వ తేదీ నుంచి ప్రారంభించింది. అయితే, ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మరియు నవంబర్ 18వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ 330 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ఈ 330 రోజుల చెల్లుబాటు కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో డైలీ 1.5 GB డైలీ డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనం కూడా అందిస్తుంది. అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 11 నెలల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందించవచ్చు మరియు సోషల్ సర్వీస్ చేసిన గొప్ప అనుభూతిని కూడా అనుభవించవచ్చు.
Also Read: OnePlus 15 ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన వన్ ప్లస్.!
బీఎస్ఎన్ఎల్ రూ. 485 ప్లాన్ పై కూడా ఈ అదనపు 5% లాభాలు అందించింది. అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు అదనపు ప్రయోజనాలు అందిస్తుంది. ఇక ఈ ప్లాన్ అందించే రెగ్యులర్ ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ 72 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ కంప్లీట్ వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది.