BSNL Long Plan with daily 3gb data and unlimited benefits
BSNL Long Plan: ఒక్కసారి రీఛార్జ్ చేసి పూర్తిగా సంవత్సరం మొత్తం హాయిగా అన్లిమిటెడ్ లాభాలు అందుకోవడానికి బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను తన యూజర్ల కోసం అందించింది. వీటిలో రీసెంట్ గా అందించిన ఒక లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే డైలీ 3GB వేగవంతమైన డేటాతో పాటు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చేసే ఖర్చును 12 నెలలకు లెక్కిస్తే నెలకు కేవలం 236 రూపాయలు మాత్రమే అవుతుంది. మరి, బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
2026 సంవత్సరం ప్రారంభంలో బిఎస్ఎన్ఎల్ కొత్తగా తీసుకొచ్చినటువంటి వన్ ఇయర్ లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,799 గురించే మనం మాట్లాడుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,799 రూపాయల ఖర్చుతో సంవత్సరం మొత్తం గొప్ప డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం అందించిన ఈ బెస్ట్ లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.
Also Read: Realme P4 Power స్మార్ట్ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే పవర్ ఫుల్ ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!
ఎక్కువ డేటా తో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే ప్లాన్ కోసం చూస్తున్న యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్ ఎంపిక అవుతుంది. ఎందుకంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు డైలీ 3 జీబీ హై స్పీడ్ డేటాని పూర్తి సంవత్సరకాలం అందిస్తుంది. డైలీ అందించే ఈ లిమిటెడ్ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. ఇదే కాదు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS కూడా అందిస్తుంది. అంటే, ఈ ప్లాన్ సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు మరియు అధిక డేటా ఆఫర్ చేస్తుంది.
ఇదే లాభాలు మరింత చవక ధరలో అందించే మరో ప్లాన్ ఉంది. అదే, రూ. 2,399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ తో కూడా పైన తెలిపిన ప్లాన్ మాదిరిగా 365 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100SMS మరియు అధిక డేటా అందుకోవచ్చు. అయితే, పైన తెలిపిన ప్లాన్ డైలీ 3GB డేటా అందిస్తే, ఈ ప్లాన్ మాత్రం డైలీ 2.5 జీబీ డేటా అందిస్తుంది. కానీ, జనవరి 31వ తేదీ లోపుగా ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసే వారికి మాత్రమే డైలీ 2.5 జీబీ డేటా లభిస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ ప్లాన్ తో డైలీ కేవలం 2 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది.