BSNL: కాలింగ్, డేటా వంటి అన్ని లాభాలను అందించే బెస్ట్ ప్లాన్.!

BSNL: కాలింగ్, డేటా వంటి అన్ని లాభాలను అందించే బెస్ట్ ప్లాన్.!
HIGHLIGHTS

కాలింగ్, డేటా వంటి అన్ని లాభాలను అందించే బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్లాన్

ఈ ప్లాన్ కాలింగ్, డేటా మరియు SMS వంటి అన్ని లాభాలను చాలా తక్కువ ఖర్చు లోనే అందిస్తుంది

ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే ఒక సంవత్సరం మొత్తంగా నిశ్చింతగా ఉండవచ్చు

BSNL: కాలింగ్, డేటా వంటి అన్ని లాభాలను అందించే బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం ఒక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో వుంది. అదే, బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ కాలింగ్, డేటా మరియు SMS వంటి అన్ని లాభాలను చాలా తక్కువ ఖర్చు లోనే అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్ వివరాలు ఏమిటో చూద్దామా.

బిఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్లాన్              

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంటే, ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే మీరు పూర్తిగా ఒక సంవత్సరం మొత్తంగా నిశ్చింతగా ఉండవచ్చు. ఈ ప్లాన్ తో మీకు ప్రతీ నెలకు 300 మినిట్స్ కాలింగ్, 3GB హై స్పీడ్ డేటా మరియు ప్రతి నెలకు 30 SMS లిమిట్ వంటి లాబాలు అందుతాయి. 

అదేమిటి 365 రోజుల వ్యాలిడిటీ అని చెప్పి ప్రతీ నెలకు కాలింగ్, డేటా అని చెబుతున్నారు అనుకుంటున్నారా? అవును ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని నెలల వారీగా కాలింగ్ డేటా ప్రయోజనాలతో అందిస్తుంది. అంటే, పైన తెలిపిన కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలు నెల నెలా మొత్తం 12 నెలలకు అందుతాయి. 

ఈ ప్లాన్, అత్యంత చావకైన వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గా కూడా నిలుస్తుంది.  
  
మరిన్ని బెస్ట్ BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo