BSNL ధమాకా అఫర్: ఈ ప్లాన్స్ తో రూ.500 లోపలే అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోండి

HIGHLIGHTS

BSNL వినియోగదారులకు బెస్ట్ ప్లాన్స్

అధిక డేటా మరియు డైలీ ఉచిత SMS సర్వీస్

రూ.500 లోపలే అన్లిమిటెడ్ సర్వీస్ లాభాలు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లేదా BSNL వినియోగదారులకు బెస్ట్ ప్లాన్స్ చాలానే అందించింది. వాటిలో, రూ.500 లోపలే అన్లిమిటెడ్ సర్వీస్ లాభాలను అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అంటే, ఈ ప్లాన్స్ అన్లిమిటెడ్ కాలింగ్, అధిక డేటా మరియు డైలీ ఉచిత SMS వంటి సర్వీస్ లను అఫర్ చేస్తాయి.ఇది మాత్రమే కాదు, కేవలం రూ.500 కంటే తక్కువకే ఒక నెల వ్యాలిడిటీ మొదలుకొని పూర్తి సంవత్సరం వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్లాన్స్ ను కూడా BSNL అందించింది. మరి BSNL యొక్క ఆ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం..!

BSNL రూ.199 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.199 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 60GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తి నెల మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.                        

BSNL రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.

BSNL రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం వ్యాలిడిటీ తో వస్తుంది మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి.

BSNL రూ.499 STV ప్లాన్

BSNL యొక్క రూ.499 STV ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 180GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా మూడు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అదనంగా, ఫ్రీ కాలర్ ట్యూన్ మరియు ఉచిత Zing యాప్ యాక్సెస్ కూడా అందిస్తుంది.

BSNL యొక్క మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :