BSNL: రూ.249 ఖర్చుతో 45 రోజులు డైలీ డేటా మరియు కాలింగ్..ఎవరి కంటే..!

HIGHLIGHTS

BSNL యూజర్లకు చవక ధరలోనే చాలా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి

45 రోజులు ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్ కూడా ఒకటి ఉంది

ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాల గురించి తెలుసుకోండి

BSNL యూజర్లకు చవక ధరలోనే చాలా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అతితక్కువ ధరలో 45 రోజులు ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్ కూడా ఒకటి ఉంది. అదే, BSNL యొక్క రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్. బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ జనరల్ ప్లాన్ వోచర్ డైలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు SMS వంటి అని ప్రయోజనాలను తీసుకువస్తుంది. BSNL అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాల గురించి తెలుసుకోండి. 

BSNL Rs.249 Plan

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను ప్రతిరోజూ 2GB డేటా మీకు అందుతుంది. అయితే,ఈ డైలీ లిమిటెడ్ డేటా ముగిసిన తరువాత స్పీడ్ 40Kbps కి తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ తో లోకల్ మరియు నేషనల్ అన్లిమిటెడ్ కాలింగ్ కూడా బిఎస్ఎన్ఎల్ అఫర్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు డైలీ 100 ఉచిత SMS ల ప్రయోజనాన్ని కూడా ఈ ప్లాన్ తో పొందవచ్చు. అయితే, ఇది FRC (ఫస్ట్ రీఛార్జ్) ప్లాన్ మరియు ఇతర ప్లాన్ నుండి వలస వచ్చే వారికి ఈ ప్లాన్ వర్తించదు.

చవక ధరలో మరిన్ని ప్రయోజనాలను అందించే మరొక బెస్ట్ ప్లాన్ కూడా ఉంది. అదే, BSNL యొక్క PV 269 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాల గురించి క్రింద చూడవచ్చు.         

BSNL Rs.229 Plan

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ PV 269 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా నెల రోజుల (క్యాలెండర్ మంత్) వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారీ 2GB డైలీ డేటా కూడా అందుతుంది. ఈ రోజువారీ డేటా పరిమితి అయిపోయిన తరువాత కూడా 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ గా డేటాని వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ తో డైలీ 100 ఉచిత SMS లను కూడా మీరు పొందుతారు. ఈ ప్లాన్ ఛాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. 

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :