BSNL Diwali Bonanza: కేవలం రూపాయికే నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి!

Updated on 15-Oct-2025
HIGHLIGHTS

దేశ ప్రజలకు బీఎస్ఎన్ఎల్ దీపావళి కానుక అందించింది

రూపాయితో నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది

BSNL Diwali Bonanza కొత్త ఆఫర్ ని ప్రకటించింది

BSNL Diwali Bonanza: భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దేశ ప్రజలకు దీపావళి కానుక అందించింది. కేవలం ఒక్క రూపాయితో నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ తో కేవలం ఒక్క రూపాయికి నెల మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ హై స్పీడ్ డేటా మరియు ఎస్ఎంఎస్ వంటి లాభాలు కూడా పొందవచ్చు. మరి బీఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రకటించిన ఈ ఆఫర్ ఏమిటి మరియు ఈ ఆఫర్ కండిషన్స్ ఏంటో చూద్దామా.

BSNL Diwali Bonanza ఏమిటి?

బీఎస్ఎన్ఎల్ కొత్త యూజర్ల కోసం ఈ కొత్త ఆఫర్ ని ప్రకటించింది. అంటే కొత్తగా బీఎస్ఎన్ఎల్ SIM కార్డ్ తీసుకునే యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ పని చేస్తుంది. మీరు కొత్త బీఎస్ఎన్ఎల్ నెంబర్ తీసుకునే ఆలోచనలో ఉంటే ప్రస్తుతం ఉన్న ఆఫర్ తో ఉచిత బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తో పాటు ఒక్క రూపాయి చెల్లించి 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించవచ్చు. అంటే, ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’ సామెత మాదిరిగా అటు ఉచిత సిమ్ కార్డు మరియు ఇటు సింగిల్ రూపీకే వన్ మంత్ బెనిఫిట్స్ ఈ ఆఫర్ తో అందుకోవచ్చు.

BSNL Diwali Bonanza ఎప్పుడు ముగుస్తుంది?

బీఎస్ఎన్ఎల్ ఈరోజు ప్రారంభించిన ఈ కొత్త ఆఫర్ నెల రోజులు అందుబాటులో ఉంటుంది. అంటే, ఈ బీఎస్ఎన్ఎల్ రూ. 1 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ అక్టోబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

Also Read: Flipkart Diwali Sale భారీ డిస్కౌంట్ తో మోటోరోలా గేమింగ్ ఫోన్ రూ. 13,499 ధరకే లభిస్తోంది.!

బీఎస్ఎన్ఎల్ రూ. 1 ఆఫర్ అందించే బెనిఫిట్స్ ఏమిటి?

ఈ బీఎస్ఎన్ఎల్ ఒక్క రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ తో వన్ మంత్ బెనిఫిట్స్ యూజర్లకు అందుతాయి. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో డైలీ 100 SMS వినియోగ సౌలభ్యం కూడా అందిస్తుంది.

మీరు కూడా ఈ కొత్త ఒక్క రూపాయి పొందాలనుకుంటే బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఉచిత సిమ్ కార్డు అందుకొని ఈ ఆఫర్ తో రీఛార్జ్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా స్వదేశీ 4G నెట్వర్క్ విస్తరించింది. అదే ఒరవడితో ఇప్పుడు కొత్త యూజర్లను ఆకర్షించే పనిలో పడింది మరియు కొత్త సరసమైన ప్లాన్ మరియు ఆఫర్స్ అందిస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :