BSNL: రూ. 49 కే OTT లాభాలను ఆఫర్ చేస్తున్న ప్రభుత్వ సంస్థ.!

HIGHLIGHTS

రూ. 49 కే OTT లాభాలను ఆఫర్ చేస్తున్న బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ రేటు సగానికి తగ్గింపు

రూ. 49 ప్లాన్ తో 4 OTT ప్లాట్ ఫామ్ లకు అన్లిమిటెడ్ యాక్సెస్

BSNL: ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ దేశంలోని ప్రయివేటు టెలికాం కంపెనీలు ఐన Airtel, Jio మరియు Vi కి పోటీగా బిఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ను ఇటీవల తీసుకు వచ్చింది. బిఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి వీలుగా అతి తక్కువ ధరలో మూడు ఆకర్షణీయమైన ప్లాన్ లను కూడా అందించింది. అయితే, అతి చవక ధరలో Jiocinema ప్లాన్ ను అందించిన వారంలో, బిఎస్ఎన్ఎల్ సినిమా ప్లాన్ రేట్ ను మరింత తగ్గించింది.

BSNL Cinema Plus

BSNL Cinema Plus

బిఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ లాంచ్ తో మూడు ప్లాన్ లను విడుదల చేసింది. ఈ ప్లాన్ లను రూ. 99, రూ. 199 మరియు రూ. 249 ధర లతో ప్రకటించింది. అయితే, ఇప్పుడు రూ. 99 ప్లాన్ ను రేటును సగానికి సగం తగ్గించింది. ఇప్పుడు ఈ ప్లాన్ ను కేవలం రూ. 49 రూపాయలకే అందిస్తోంది.

ఈ ప్లాన్ తో వచ్చే OTT లాభాలు ఏమిటి?

బిఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ యొక్క రూ. 49 ప్లాన్ తో Shemaroo, Hungama, Lionsgate మరియు EPIC ON యొక్క అన్లిమిటెడ్ యాక్సెస్ లభిస్తుంది. అంటే, ప్లాన్ తో ఈ నాలుగు యాప్స్ కి సబ్ స్క్రిప్షన్ యూజర్లకు లభిస్తుంది.

అయితే, బిఎస్ఎన్ఎల్ కేవలం ఈ ప్లాన్ రేటు లో మాత్రమే మార్పులు చేసింది. ఇతర రెండు ప్లాన్ లైన రూ. 199 మరియు రూ. 249 ధర లలో ఎటువంటి మార్పులు చేయలేదు.

Also Read: ఈ టాప్ ఫీచర్స్ తో రేపు విడుదల కాబోతున్న Vivo V30e స్మార్ట్ ఫోన్.!

రూ. 199 ప్లాన్ ప్లాన్ తో వచ్చే OTT లాభాలు ఏమిటి?

ఈ రూ. 199 ప్లాన్ తో ప్రీమియం యాప్స్ అయిన ZEE5 ప్రీమియం, Sony LIV ప్రీమియం , YuppTV మరియు Disney+ Hotstar యొక్క సబ్ స్క్రిప్షన్ అందుతుంది. అంటే, ఈ నాలుగు ప్రీమియం OTT ల పైన అన్లిమిటెడ్ కంటెంట్ ను ఆనందించవచ్చు.

రూ. 249 ప్లాన్ ప్లాన్ తో వచ్చే OTT లాభాలు ఏమిటి?

ఇది బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ప్రీమియం ప్లాన్. ఈ ప్లాన్ తో ZEE5 ప్రీమియం, Sony LIV ప్రీమియం , YuppTV , Shemaroo, Hungama, Lionsgate మరియు Disney+ Hotstar నుండి అన్లిమిటెడ్ కంటెంట్ ను ఎంజాయ్ చేయవచ్చు.

అయితే, బిఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ద్వారా ఈ ప్లాన్ లను అందుకోవడానికి బిఎస్ఎన్ఎల్ యొక్క ల్యాండ్ లైన్ లేదా బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ లను కలిగి ఉండాలి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :