BSNL గుడ్ న్యూస్: అన్లిమిటెడ్ OTT ఎంటర్టైన్మెంట్ రూ.49 తో ప్రారంభం.!
Rs 49 ప్రారంభ ధర నుండి మొదలుకొని అన్లిమిటెడ్ OTT ఎంటర్టైన్మెంట్
బిఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ నుండి మూడు కొత్త ప్లాన్స్
OTT లకు అన్లిమిటెడ్ యాక్సెస్ అందిస్తుంది
BSNL ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల కోసం గొప్ప శుభవార్త అందించింది. కేవలం 49 రూపాయల ప్రారంభ ధర నుండి మొదలుకొని అన్లిమిటెడ్ OTT ఎంటర్టైన్మెంట్ ను అందుకోవచ్చని తెలిపింది. Yupptv Scope పేరుతొ BSNL ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు OTT సబ్ స్క్రిప్షన్ అవసరాలను తీర్చిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు దీన్ని BSNL Cinema Plus గా మార్పు చేసి, ప్లాన్ రేట్ లను కూడా భారీగా తగ్గించింది.
Surveyఫైబర్ బ్రాడ్ బ్యాండ్ యూజర్ల కోసం బిఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ నుండి మూడు కొత్త ప్లాన్స్ ను ఆఫర్ల చేస్తోంది. ఇందులో, బేసిక్ ప్లాన్ రూ. 49 ధరకే వస్తుంది మరియు ఈ ప్లాన్ ను Starter Pack గా పిలుస్తోంది. రెండవ ప్లాన్ పేరు Full Pack మరియు ఈ ప్లాన్ ధర రూ.199 రూపాయలు. ఇక మూడవ ప్లాన్ Premium Pack పేరుతో బిఎస్ఎన్ఎల్ అఫర్ చేస్తోంది మరియు దీని ధర రూ. 249
ఈ మూడు ప్లాన్స్ తో అందించే OTT ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
Cinema Plus Rs.49 plan
ఈ ప్లాన్ తో లయన్స్ గేట్, హంగామా, షీమారు మరియు ఎపిక్ఆన్ OTT లకు అన్లిమిటెడ్ యాక్సెస్ అందిస్తుంది.
Cinema Plus Rs.199 plan
ఈ ప్లాన్ తో Zee5 Premium, SonyLIV Premium, YUppTV మరియు డిస్నీ+ హాట్ స్టార్ OTT యాక్సెస్ అందిస్తుంది.
Cinema Plus Rs.249 plan
ఈ ప్లాన్ తో పైన రెండు ప్లాన్స్ అందిస్తున్న అన్ని OTT యాప్స్ కి అన్లిమిటెడ్ యాక్సెస్ ఒకదగ్గరే అందిస్తుంది. అంటే, Zee5 Premium, SonyLIV Premium, YUppTV తో పాటుగా డిస్నీ+ హాట్ స్టార్, షీమారు, లయన్స్ గేట్, హంగామా లకు యాక్సెస్ అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile