BSNL: రూ. 200 కంటే తక్కువ ఖర్చులో వచ్చే బెస్ట్ ప్లాన్స్.!

HIGHLIGHTS

రూ. 200 కంటే తక్కువ ఖర్చులో వచ్చే బెస్ట్ ప్లాన్స్

చాలా తక్కువ ధరలో మంచి ప్లాన్ కోరుకునే వారికి ఈ ప్లాన్స్ సరిపోయేలా ఉంటాయి

BSNL యెక్క ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపైడ్ ప్లాన్స్ పైన ఒక లుక్ వేద్దాం

BSNL: రూ. 200 కంటే తక్కువ ఖర్చులో వచ్చే బెస్ట్ ప్లాన్స్ పైన ఈరోజు ఒక లుక్కేద్దాం. ఎందుకంటే, చాలా తక్కువ ధరలో మంచి ప్లాన్ కోరుకునే వారికి ఈ ప్లాన్స్ సరిపోయేలా ఉంటాయి. వాస్తవానికి, కేవలం నామమాత్రపు ధరలకు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ఆఫర్ల చేస్తున్న ప్రధమ టెలికం కంపెనీ గా BSNL పేరు తెచ్చుకుంది. అందుకే, BSNL యెక్క ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపైడ్ ప్లాన్స్ పైన ఒక లుక్ వేద్దాం. 

బిఎస్ఎన్ఎల్ రూ. 105 ప్లాన్

ఈ బిఎస్ఎన్ఎల్ రూ. ప్రీపెయిడ్ ప్లాన్ 18 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ చెల్లుబాటు కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్, మరియు 2GB హై స్పీడ్ డేటా కూడా అందిస్తుంది. అయితే, ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో మీరు SMS ప్రయోజనాన్ని మాత్రం పొందలేరు. ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ తో మీరు లోకల్ SMS కోసం 80 పైసలు మరియు నేషనల్ SMS కోసం Rs. 1.20 చెల్లించ వలసి ఉంటుంది.

బిఎస్ఎన్ఎల్ రూ. 107 ప్లాన్ 

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 107 ప్రీపెయిడ్ ప్లాన్ 35 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ BSNL ప్లాన్ తో మీరు 200 నిముషాల కాలింగ్ మరియు 3GB హై స్పీడ్  డేటా కూడా లభిస్తుంది. ఈ బడ్జెట్ ప్లాన్ రీఛార్జ్ తో చెల్లుబాటు కాలానికి ఉచిత BSNL Tunes ఆనందాన్ని కూడా పొందవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, లిమిటెడ్ ప్రయోజనాలతో ఆల్ రౌండ్ లాభాలను అందించే టాప్ ప్లాన్ గా ఇది కొనియాడ బడుతుంది

బిఎస్ఎన్ఎల్ రూ. 199 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ తో మరిన్ని అదనపు బెనిఫిట్స్ ను మీరు అందుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా మరియు డైలీ 100 SMS లతో పాటుగా Zing యాక్సెస్ ను కూడా అఫర్ చేస్తోంది. ఈ ఫ్రీ బైస్ ను కేవలం 15 రోజుల కాలానికి మాత్రమే అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :