BSNL చవక ప్లాన్: రూ.439 ఖర్చుతో 90 రోజుల ప్రయోజనాలు పొందండి.!

HIGHLIGHTS

BSNL యూజర్లకు చాలా తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్స్

అన్లిమిటెడ్ కాలింగ్ 90 రోజులు ఆనందించండి

ఈరోజు అటువంటి బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చూడనున్నాము

BSNL చవక ప్లాన్: రూ.439 ఖర్చుతో 90 రోజుల ప్రయోజనాలు పొందండి.!

BSNL యూజర్లకు చాలా తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్స్ కి కొదవే లేదు. అయితే, వీటిలో మరింత చవక ధరలో ఎక్కువ లాభాలను అందించే ప్లాన్స్ కూడా కొన్ని వున్నాయి. ఈరోజు అటువంటి బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చూడనున్నాము. అదే, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ యొక్క రూ. 439 స్పెషల్ టారిఫ్ వోచర్. ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న ప్రయోజనాలను చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL రూ. 439 ప్లాన్ 

BSNL యొక్క రూ. 439 స్పెషల్ టారిఫ్ వోచర్ ప్లాన్ మీకు పూర్తిగా మూడు నెలల (90రోజులు) వ్యాలిడిటీ అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో మీరు పూర్తి చెల్లుబాటు కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా అందుకుంటారు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే కస్టమర్లు ముంభై మరియు ఢిల్లీ నేషనల్ రోమింగ్ లో కూడా అన్లిమిటెడ్ కాలింగ్ వినియోగించుకోవచ్చు.

అయితే, ఈ ప్లాన్ పైన మీకు ఎటువంటి ఇతర ప్రయోజనాలను BSNL అందిచడం లేదు. అంటే, డేటా మరియు SMS వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్ తో మీకు లభించవు. డేటా జతగా ప్లాన్స్ కొసరుకునే వారికి ఈ ప్లాన్ సరైంది కాదు. కానీ, కేవలం కాలింగ్ కోసం మంచి BSNL ప్లాన్ కోరుకునే వారికి ఈ ప్లాన్ నప్పుతుంది. 

అయితే, మరు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా హెవీ డేటాని కోరుకుంటే ఒక బెస్ట్ ప్లాన్ మీకు BSNL అఫర్ చేస్తోంది. అదే, BSNL యొక్క రూ. 599 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్. ఈ ప్లాన్ అఫర్ చేసే ప్రయోజాలను క్రింద చూడవచ్చు.

BSNL రూ. 599 ప్లాన్

BSNL యొక్క ఈ రూ. 599 ప్లాన్ వర్క్ ఫ్రమ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. అంతేకాదు, డైలీ 3GB డేటా మరియు డైలీ 100 SMS లు వినియోగ ప్రయోజనం కూడా ఈ ప్లాన్ తో పొందవచ్చు. ఈ ప్లాన్ తో అదనపు ప్రయోజానాలను కూడా బిఎఎన్ఎల్ అఫర్ చేస్తోంది. 

ఈ ప్లే తో రీఛార్జ్ చేసే యూజర్లు Zing, PRBT మరియు రాత్రి 12 నుండి ఉదయం 5 గంటల వరకూ అన్లిమిటెడ్ డేటా వినియోగం వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 

మరిన్ని బెస్ట్ BSNL ప్లాన్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo