BSNL: ఖర్చు తక్కువే అయినా లాభాలు ఎక్కువ అందించే బెస్ట్ ప్లాన్స్.!

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్స్

ఖర్చు తక్కువే అయినా లాభాలు ఎక్కువ అందించే ప్లాన్స్

అదనపు లాభాలను కస్టమర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ ద్వారా అందుకుంటారు

ఖర్చు తక్కువే అయినా లాభాలు ఎక్కువ అందించే బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్స్ కొన్ని ఉన్నాయి. ప్లాన్స్ ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్లాన్స్ కోసం ఖర్చుచేసేది తక్కువ డబ్బే అయినా లాభాలను మాత్రం ఎక్కువ పొందవచ్చు. అందుకే, BSNL యొక్క ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు వాటి వివరాలను చూద్దాం. 

BSNL Rs.599 Plan

ఈ ప్లాన్ కంప్లీట్ ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్ గా చెప్పబడుతుంది. ఈ ప్లాన్ తో రోజుకు 3GB డేటాని మీరు 84 రోజులు పొందవచ్చు. అలాగే, 84 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS లు కూడా చేసుకోవచ్చు. ఈ రెగ్యులర్ ప్రయోజనాలతో పాటు PRBT, Zing సబ్ స్క్రిప్షన్, జోతిష్యం మరియు గేమ్స్ తో పాటుగా రాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకూ ఉచిత డేటా వినియోగం వంటి అదనపు లాభాలను కూడా కస్టమర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ ద్వారా అందుకుంటారు.    

BSNL Rs.499 Plan

ఈ ప్లాన్ కూడా BSNL WFH 599 ప్లాన్ మాదిరిగానే అన్ని ప్రయోజనాలను అందిస్తోంది. అయితే, ఈ ప్లాన్ 75 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే వస్తుంది మరియు రోజుకి 2GB డేటాని మాత్రమే అందిస్తుంది. 

BSNL Rs.319 Plan

ఈ బిఎస్ఎన్ఎల్  ప్రీపెయిడ్ ప్లాన్ తో యూజర్లు 65 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యాన్ని పొందుతారు. అలాగే, 65 రోజుల వ్యాలిడిటీ కోసం 10GB డేటా మరియు 300 SMS ప్రయోజనం కూడా మీకు లభిస్తుంది. 

మరిన్ని BSNL బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :