BSNL 4G లేదా BSNL 5G: సెప్టెంబర్ 27న బిగ్ సర్ప్రైజ్ ఇస్తామని చెబుతున్న బిఎస్ఎన్ఎల్.!

Updated on 25-Sep-2025
HIGHLIGHTS

ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ కొత్త న్యూస్ అందించింది

ప్టెంబర్ 27న బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తామని బిఎస్ఎన్ఎల్ కొత్త ట్వీట్ చేసింది

బిఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ మరియు సర్వీస్ గురించి ఈ ట్వీట్ చేసింది

BSNL 4G లేదా BSNL 5G: ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ కొత్త న్యూస్ అందించింది. సెప్టెంబర్ 27న బిగ్ సర్ప్రైజ్ ఇస్తామని బిఎస్ఎన్ఎల్ కొత్త ట్వీట్ చేసింది. బిఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ మరియు సర్వీస్ గురించి ఈ ట్వీట్ చేసింది. ఇప్పటికే దేశం మొత్తం 4G నెట్వర్క్ విస్తరించడానికి పూనుకున్న బిఎస్ఎన్ఎల్, చాలా వేగంగా ఈ సర్వీస్ ను విస్తరించడం మొదలు పెట్టింది. బిఎస్ఎన్ఎల్ అందించిన డేట్ లో కొత్తగా ఏమి అనౌన్స్ చేస్తుందా అని సర్వత్రా చర్చ మొదలయ్యింది.

BSNL 4G లేదా BSNL 5G:

బిఎస్ఎన్ఎల్ అఫీషియల్ X అకౌంట్ నుంచి ఈ కొత్త ట్వీట్ అందించింది. ఈ ట్వీట్ నుంచి సెప్టెంబర్ 27 నుంచి భారత కనెక్టివిటీ కొత్త పుంతలు తొక్కుతుంది అని ట్వీట్ చేసింది. “Swadeshi Digital Bharat” కొత్త చాప్టర్ ప్రారంభం అవుతుంది, అని కూడా ఈ ట్వీట్ లో తెలిపింది. బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ ని లాంచ్ చేస్తున్నట్లు ఇది క్లియర్ చేస్తుంది. వాస్తవానికి, జూన్ నెలలో మొదలు కావాల్సిన పాన్ ఇండియా బిఎస్ఎన్ఎల్ 4G సర్వీస్ ఎట్టకేలకు సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని మనం ఆశాభావం వ్యక్తం చేయవచ్చు.

ఇది డైరెక్ట్ వెర్షన్ అయితే ఇన్ డైరెక్ట్ వెర్షన్ ఇంకొకటి ఉంది. అంటే, ఈ కొత్త అప్డేట్ గురించి రూమర్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఇది బిఎస్ఎన్ఎల్ ఖ్యాతిని మరింత పెంచేలా ఉంటుంది. అదేమిటంటే, బిఎస్ఎన్ఎల్ 5G సర్వీస్ ను త్వరలోనే మెట్రో సిటీల్లో 5G లాంచ్ చేసే అవకాశం ఉందని రూమర్ ఒకటి ఉంది. మెట్రో సిటీ అంటే ఢిల్లీ మరియు ముంబై నగరాల్లో ముందుగా ఈ సర్వీస్ లను అందించే అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. అందుకే, బిఎస్ఎన్ఎల్ అంత ఆర్భాటం చేస్తోందని కూడా గుసగుసలాడుతున్నారు.

అయితే, వాస్తవానికి బిఎస్ఎన్ఎల్ 5G సర్వీస్ లాంచ్ గురించి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. 2025 ముగిసే నాటికి 5జి సర్వీస్ వచ్చే అవకాశం ఉండవచ్చని ముందుగా బిఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ తో 4G సర్వీస్ ఇండియా మొత్తం అందుబాటులోకి రావడానికి మాత్రమే కాదు 5జి సర్వీస్ కోసం కొత్త బాటలు వేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Also Read: WhatsApp ద్వారా మీ Aadhaar Card ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.!

ఇదే కనుక నిజం అయితే త్వరలోనే బిఎస్ఎన్ఎల్ యూజర్లు వేగవంతమైన ఇంటర్నెట్ తో పాటు గొప్ప కాలింగ్ సౌలభ్యాన్ని కూడా అందుకుంటారు. మరో రెండు రోజుల్లో ఈ సస్పెన్స్ కూడా తొలగిపోతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :