BSNL: యూజర్లకు తక్కువ ధరలో అధిక లాభాలను అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్.!

HIGHLIGHTS

యూజర్లకు తక్కువ ధరలో అధిక లాభాలను అఫర్ చేసే BSNL బెస్ట్ ప్లాన్స్

500 రూపాయల కంటే తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్

కాలింగ్, డేటా మరియు మరిన్ని లాభాలను ఈ బెస్ట్ ప్లాన్స్ అఫర్ చేస్తాయి

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన యూజర్లకు తక్కువ ధరలో అధిక లాభాలను అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ గురించి ఈరోజు చూడనున్నాము. అతి తక్కువ ధర నుండి  500 రూపాయల కంటే తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ గురుంచి ఈరోజు వివరంగా చూడనున్నాము. కాలింగ్, డేటా మరియు మరిన్ని లాభాలను ఈ బెస్ట్ ప్లాన్స్ అఫర్ చేస్తాయి. మరింకెద్న్హుకు ఆలశ్యం.  తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్ గురించి వివరంగా తెలుసుకుందామా.

BSNL రూ. 106 రీఛార్జ్ ప్లాన్

BSNL యొక్క రూ. 106 స్పెషల్ టారిఫ్ వోచర్ ఏకంగా 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. వ్యాలిడిటీ కాలానికి గాను 3GB హై స్పీడ్ డేటా మరియు 100 మినిట్స్ ఉచిత లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత కాలింగ్ మినిట్స్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇక ఈ 100 మినిట్స్ ఉచిత కాలింగ్ లిమిట్ ముగిసిన తరువాత కాలింగ్ కోసం నిముషానికి 30 పైసలు చెల్లించాలి. అధనంగా, ఈ ప్లాన్‌ ద్వారా 60 రోజుల పాటు కాలర్ ట్యూన్ సర్వీస్ ను ఉచితంగా పొందవచ్చు.

BSNL రూ.197 ప్లాన్

BSNL యొక్క రూ.197 రీఛార్జ్ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, డైలీ 2GB హై స్పీడ్ డేటా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు  డైలీ 100SMS లాభాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే, ఉచిత ప్రయోజానాలన్ని కూడా కేవలం 18 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ వ్యాలీడీటీ మాత్రం 150 రోజులకు వర్తిస్తుంది.  

BSNL రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.

BSNL రూ.397:

పైన తెలిపి అఫర్ తో పాటుగా మరోక బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా BSNL తన కస్టమర్ల కోసం అఫర్ చేస్తోంది. అదే రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ అఫర్ ముందు నుండే  అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

BSNL యొక్క మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :