BSNL ధమాకా అఫర్: రూ.1,198 ఖర్చుతో 365 రోజులు ఆనందించండి.!

HIGHLIGHTS

అతితక్కువ ధరలో అధిక లాభాలను అందించే ప్రీపెయిడ్ ప్లాన్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అందిస్తున్న బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్

బడ్జెట్ ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వారికి నప్పుతుంది

ప్రభుత్వ టెలికం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అతితక్కువ ధరలో అధిక లాభాలను అందించే ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తున్న టెలికం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అందిస్తున్న బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ లలో రూ.1,198 ప్లాన్ కూడా ఒకటి. ఈ ప్లాన్ పూర్తిగా 365 రోజులు కాలింగ్, డేటా మరియు SMS లతో సహా అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. BSNL అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గురించి తెలుసుకుందామా. 

BSNL Rs.1,198 Plan:

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యొక్క ఈ రూ.1,198 ప్లాన్ బడ్జెట్ ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వారికి నప్పుతుంది. ఈ ప్లాన్ నెలకు కేవలం 300 కాలింగ్ మినిట్స్, 3GB డేటా మరియు 30 SMS లను అందిస్తుంది. ఈవిధంగా ప్రతీ నెలా మీకు కాలింగ్, డేటా మరియు SMS లాభాలు అందుతాయి. అంటే, 12 నెలలు (365 days) మీరు కాలింగ్, డేటా మరియు SMS లాభాలను ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

రూ.1,198 ప్లాన్ ను 12 నెలలకు విభజిస్తే నెలకు కేవలం రూ.99 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. అయితే, కాలింగ్ మరియు డేటా ఎక్కువగా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోకపోవచ్చు. కానీ, తక్కువ ధరలో రెగ్యులర్ వాడకానికి ఈ ప్లాన్ సరిపోతుంది. 

అతితక్కువ ధరలో మరిన్ని ప్రయోజాలను అందించే మరొక ప్లాన్ కూడా వుంది. అదే BSNL రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ తో మీకు 365 రోజుల వ్యాలిడిటీ అందుతుంది. ఈ ప్లాన్ అందించే ప్రయోజాలను క్రింద చూడవచ్చు.     

BSNL రూ.797:

BSNL యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రోజూ 2GB హై స్పీడ్ డేటా మరియు ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. అలాగే, ఇతర ఆఫర్లతో పాటుగా వచ్చే కాలర్ ట్యూన్ సర్వీస్ ఉచిత యాక్సెస్ మాత్రం ఈ ప్లాన్ కు వర్తించదు.

మరిన్ని బెస్ట్ BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :