BSNL: రూ.147 ఖర్చుతోనే నెల మొత్తం కాలింగ్, డేటా అందించే బెస్ట్ ప్లాన్.!

HIGHLIGHTS

BSNL కస్టమర్లకు తక్కువ ఖర్చులో వచ్చే బెస్ట్ ప్లాన్

ఈ ప్లాన్ మీ నెల వారి కాలింగ్ మరియు డేటా అవసరాలను తీరుస్తుంది

ఆల్ రౌండ్ ప్రయోజనాలను అందించే బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్

BSNL కస్టమర్లకు చాలా  తక్కువ ఖర్చుతోనే నెల మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మరియు మరిన్ని ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్ ను అందించింది. ఈ ప్లాన్ కేవలం రూ.147 రూపాయల ఖర్చులోనే మీ నెల వారి కాలింగ్ మరియు డేటా అవసరాలను తీరుస్తుంది. ఇది మాత్రమే కాదు ఇటువంటి ఆల్ రౌండ్ ప్రయోజనాలను అందించే మరొక బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా BSNL కస్టమర్లకు అందుబటులో వుంది. మరి ఈరోజు ఈ రెండు బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందామా. 

BSNL Rs.147 Plan

BSNL యొక్క ఈ Rs.147 Plan యూజర్లకు 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ తో యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని అందుకుంటారు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు లోకల్ మరియు నేషనల్ రోమింగ్ లో కూడా అన్లిమిటెడ్ కాలింగ్ ను ఉపయోగించుకోవచ్చు. అలాగే, ఈ ప్లాన్ తో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 10GB డేటా కూడా యూజర్లకు లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్ తో BSNL tunes కి యాక్సెస్ కూడా లభిస్తుంది. 

కేవలం కాలింగ్ మరియు తక్కువ డేటా కోరుకునే వారికి ఈ బడ్జెట్ అన్లిమిటెడ్ ప్లాన్ సరిపోతుంది. ఒకవేళ మీరు డైలీ డేటాతో పాటుగా కాలింగ్ మరియు SMS ప్రయోజనాన్ని కూడా కోరుకునట్లయితే రూ.184 ప్రీపెయిడ్ ప్లాన్ ను పరిశీలించవచ్చు. 

BSNL Rs.184 Plan

ఈ Rs.147 Plan ప్రీపెయిడ్ ప్లాన్ తో యూజర్లు 28 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్లాన్ తో మీరు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని అందుకుంటారు. ఈ ప్లాన్ తో కూడా మీరు లోకల్ మరియు నేషనల్ రోమింగ్ లో కూడా అన్లిమిటెడ్ కాలింగ్ ను ఉపయోగించుకోవచ్చు. అలాగే, ఈ ప్లాన్ తో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 1GB డేటా మరియు డైలీ 100SMS లను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్ తో BSNL tunes కి యాక్సెస్ కూడా లభిస్తుంది. 

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :