BSNL Best Plans with one year unlimited benefits
BSNL Best Plans: మీరు బీఎస్ఎన్ఎల్ యూజర్ అయితే మీకోసం చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సర కాలం అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తాయి. ఇందులో మూడు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మీకు బెస్ట్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ గా ఉంటాయి.
బీఎస్ఎన్ఎల్ మూడు గొప్ప లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ తన యూజర్ల కోసం చాలా కాలంగా ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే పెరిగిన మరియు మరింటాగ్ పెరుగుతున్న యూజర్ బేస్ కోసం ఈ ప్లాన్ లను ఇంకా ముందు కొనసాగిస్తోంది. ఇక ఈ మూడు ప్లాన్స్ విషయానికి వస్తే, బీఎస్ఎన్ఎల్ రూ. 1,499, రూ. 1,999 మరియు రూ. 2,399 మూడు లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి.
బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ యూజర్లకు రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ అవుతుంది. ఈ ప్లాన్ వాయిస్ కాలింగ్ కోసం బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ చూసే వారికి చాలా గొప్పగా ఉంటుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 300 రోజులు వ్యాలిడిటీ మరియు ఈ వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. అలాగే, సాధారణ యూసేజ్ కోసం 300 రోజులకు గాను 32 జీబీ వేగవంతమైన డేటా, డైలీ 100 SMS మరియు ఈ లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రెగ్యులర్ యూసేజ్ కోసం ఈ రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ ప్లాన్ అవుతుంది. ఎందుకంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 330 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుతాయి. ఈ ప్లాన్ 330 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 1.5 జీబీ హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS తో పాటు డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.
Also Read: Redmi 15C 5G: కొత్త లుక్, బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీతో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
ఈ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ మంచి డేటా మరియు కాలింగ్ కోరుకునే యూజర్లకు బెస్ట్ ప్లాన్ అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 365 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుతాయి. ఈ ప్లాన్ సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ హైస్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ డైలీ 2 జీబీ డేటా ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.
బీఎస్ఎన్ఎల్ యూజర్లు వారి వారి బడ్జెట్ అనుసారం ఈ మూడు బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీలో ఒక బెస్ట్ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. దేశంలో ఇప్పుడు మరింతగా విస్తరించిన బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మంచి కనెక్టివిటీ కలిగి ఉంది.