BSNL Plans 2024
BSNL అఫర్: 40 రోజుల ప్రయోజనాలు రూ.107 ధరకే అఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీ BSNL మాత్రమే. అతితక్కువ ధరలో ఎక్కువ ప్రయోజాలను అందిస్తున్న టెలికం కంపెనీ కూడా BSNL అని సగర్వంగా చెప్పొచ్చు. BSNL అఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో Rs.107 Plan మంచి ప్రయోజాలను అందించే బెస్ట్ ప్లాన్. ఈ ప్లాన్ తో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులు 40 రోజులు కాలింగ్ మరియు డేటా ప్రయోజాలను పొందవచ్చు. BSNL అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకోండి.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో రూ.107 ప్లాన్ కూడా ఒకటి. ఈ ప్లాన్ కేవలం 107 రూపాయలకే 40 రోజుల వ్యాలిడిటీని మీకు అందిస్తుంది. ఇక ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న మరిన్ని ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో 200 మినిట్స్ ఉచిత కాలింగ్ మినిట్స్ ను కూడా అందిస్తున్నది. అలాగే, 40 రోజుల ఉచిత BSNL ట్యూన్స్ ని కూడా మీరు పొందుతారు. అంతేకాదు, పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 3GB డేటా కూడా అందుతుంది. ఈ ఫ్రీ బైస్ ముగిసిన తరువాత మీకు కాల్ మరియు డేటా రేట్లు వర్తిస్తాయి.
BSNL వినియోగదారులకు మరిన్ని లాభాలను అతి తక్కువ ధరలో అందించే మరొక బెస్ట్ ప్లాన్స్ కూడా వుంది. అదే BSNL యొక్క రూ.397 ప్లాన్. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
పైన తెలిపి అఫర్ తో పాటుగా మరోక బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా BSNL తన కస్టమర్ల కోసం అఫర్ చేస్తోంది. అదే రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ అఫర్ తో BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే పూర్తి 180 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది.
ఈ అఫర్ ముందు నుండే అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 180 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.
అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS మరియు డేటా కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి.