BSNL ధమాకా అఫర్: 10 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ రూ.397 రూపాయలకే పొందండి

HIGHLIGHTS

BSNL అతితక్కువ రేటుకే తన ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అఫర్ చేస్తోంది

కేవలం రూ.397 రూపాయలకే 10 నెలల వ్యాలిడిటీ

మరిన్ని లాభాలను కూడా పొందవచ్చు

BSNL అతితక్కువ రేటుకే తన ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అఫర్ చేస్తోంది. ఎంత చవక రేటుకే అంటే, కేవలం రూ.397 రూపాయలకే 10 నెలల వ్యాలిడిటీని పొందవచ్చు. అంతేకాదు, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా మరియు మరిన్ని లాభాలను కూడా పొందవచ్చు. వాస్తవానికి, ప్రయివేట్ టెలికం సంస్థల రేట్ల పెంపు తరువాత, BSNL మాత్రం పాత రేట్లనే  కొనసాగిస్తన్న టెలికం సంస్థగా మిగిలింది.

ఇక ఈ బెస్ట్ బడ్జెట్ అఫర్ అంటే, రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.  ఎందుకంటే, ఈ అఫర్ తో BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే  పూర్తి 300 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది.ఈ ప్లాన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కగడితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది.

ఈ అఫర్ ముందు నుండే  అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 300 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం ఇక్కడ నొక్కండి 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :