BSNL: రూ.485 ఖర్చుతోనే డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ 85 రోజులు అందుకోండి.!

HIGHLIGHTS

ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే BSNL బెస్ట్ ప్లాన్

ఈ ప్లాన్ కేవలం రూ.485 ఖర్చుతోనే డైలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది

ఈ ప్లాన్ వివరాలను క్రింద చూడవచ్చు

BSNL: రూ.485 ఖర్చుతోనే డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ 85 రోజులు అందుకోండి.!

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) కస్టమర్లకు తక్కువ ధరలో ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ గురించి ఈరోజు చుడనున్నాము. అదే, BSNL యొక్క రూ.485 రూపాయల స్పెషల్ టారిఫ్ వోచర్. ఈ ప్లాన్ కేవలం రూ.485 ఖర్చుతోనే మీకు డైలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న పూర్తి ప్రయోజనాలను చూద్దాం. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL Rs.485 Plan 

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ స్పెషల్ టారిస్ వోచర్ 85 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను లోకల్/STD అన్లిమిటెడ్ కాలింగ్ సౌలబ్యాన్ని అందిస్తుంది. ఇది కేవలం హోమ్ లైసెన్స్డ్ ఏరియా (LSA) లో మాత్రమే కాకుండా ఢిల్లీ మరియు ముంభై వంటి నేషనల్ రోమింగ్ లో కూడా చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో 85 రోజులు డైలీ 1.5GB హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది.

అయితే, కేవలం కాలింగ్ మాత్రమే కోరుకునే వారికి ఇదే ధరలో 90 రోజుల వ్యాలిడిటీ అందించే బెస్ట్ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్లాన్ కూడా వుంది. అదే, రూ.439 స్పెషల్ టారిస్ వోచర్ మరియు ఈ ప్లాన్ వివరాలను క్రింద చూడవచ్చు.    

BSNL Rs.439 Plan

BSNL STV 439 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వాస్తుంది. ఈ ప్లాన్ తో పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం మీకు లభిస్తుంది. ఈ ప్లాన్ కూడా హోమ్ LSA తో పాటుగా ఢిల్లీ మరియు ముంభై నేషనల్ రోమింగ్ లో కూడా కాలింగ్ చేసుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్ తో మీకు డేటా లేదా SMS వంటి ఇతర ప్రయోజనాలు మాత్రం లభించవు. 

కానీ, తక్కువ ఖర్చులో కేవలం కాలింగ్ కోసం ప్లాన్ కోరుకునే వారికి మూడు నెలల అన్లిమిటెడ్ సౌకర్యాన్ని అందిస్తుంది. అంటే, ఈ రీఛార్జ్ అమౌంట్ ను మూడు నెలలకు (90 రోజులకు) నెలవారీగా లెక్కిస్తే, నెలకు కేవలం రూ.146 రూపాయలే అవుతుంది. 

మరిన్ని బెస్ట్ BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo