BSNL Best Plan: ఈ ప్లాన్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు.. సంవత్సరం మొత్తం ఆనందమే.!

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలా అందించింది

బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు సంవత్సరం మొత్తం ఆనందించవచ్చు

అధిక డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు సంవత్సరం మొత్తం యూజర్లకు అందిస్తాయి

BSNL Best Plan: బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలా అందించింది. కొన్ని బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు సంవత్సరం మొత్తం ఆనందించవచ్చు. ఎందుకంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ అధిక డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు సంవత్సరం మొత్తం యూజర్లకు అందిస్తాయి. ఈరోజు అటువంటి బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ చూద్దాం.

BSNL Best Plan: ఏమిటి ఈ ప్లాన్?

బిఎస్ఎన్ఎల్ అందించిన లేటెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,799 గురించే మనం ఇప్పుడు మాట్లాడుతుంది. ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ యూజర్లకు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గా ఉంటుంది. ఈ ప్లాన్ చేసే మొత్తం ఖర్చు 12 నెలలకు లక్కగడితే, నెలకు కేవలం రూ. 233 రూపాయలు మాత్రమే వస్తుంది. కానీ, ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో ఎక్కువ లాభాలు అందుకోవచ్చు.

రూ. 2,799 ప్లాన్ బెనిఫిట్స్ ఏమిటి?

బిఎస్ఎన్ఎల్ యొక్క వన్ ఇయర్ రూ. 2,799 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేసే ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ 365 రోజుల లాంగ్ వ్యాలిడిటీ యూజర్లకు అందిస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి యూజర్లకు అన్లిమిటెడ్ కాలింగ్ కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ప్రతి రోజు 3 జీబీ వేగవంతమైన డైలీ డేటా మరియు ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఉచితంగా అందిస్తుంది. అలాగే, డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా ఈ ప్లాన్ అందిస్తుంది.

ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 2,799 వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ డైలీ అధిక డేటా కోరుకునే యూజర్లకు చక్కగా సరిపోతుంది. ఇది కాకుండా రూ. 2399 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఆల్ రౌండ్ అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.

Also Read: ChatGPT Prompts for Study: పరీక్షల కోసం స్మార్ట్‌ గా ప్రిపేర్ అయ్యే AI టెక్నిక్ తెలుసుకోండి.!

రూ. 2,399 ప్లాన్ బెనిఫిట్స్ ఏమిటి?

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అంతేకాదు, డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా ఆఫర్ చేస్తుంది. అదనంగా ఈ ప్లాన్ డైలీ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా ఉచితంగా అందిస్తుంది.

ఈ రెండు బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా బెస్ట్ వన్ ఇయర్ అన్లిమిటెడ్ ప్లాన్స్ గా నిలుస్తాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :