BSNL Best Plan: 70 రోజులు హెవీ డేటా మరియు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందుకోండి.!

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అద్భుతమైన బడ్జెట్ ప్లాన్స్ ఎన్నో అందించింది

హెవీ డేటా కోరుకునే వారికి మాత్రం కొన్ని ప్లాన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి

చాలా తక్కువ ఖర్చుతో 70 రోజులు హెవీ డేటా మరియు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్లాన్

BSNL Best Plan: బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అద్భుతమైన బడ్జెట్ ప్లాన్స్ ఎన్నో అందించింది. వీటిలో కొన్ని ప్లాన్స్ చవక ధరలో అద్భుతమైన అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి. అయితే, హెవీ డేటా కోరుకునే వారికి మాత్రం కొన్ని ప్లాన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ తో పాటు డైలీ అధిక డేటా కోరుకునే వారికి తక్కువ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాలా తక్కువ ఖర్చుతో 70 రోజులు హెవీ డేటా మరియు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్లాన్ గురించి ఈరోజు మనం వివరంగా చూద్దాం.

BSNL Best Plan: ఏమిటా ప్లాన్?

బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం అందించిన 70 రోజుల అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 599 ప్లాన్ గురించే మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ తో పాటు డైలీ హెవీ డేటా కూడా లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

బిఎస్ఎన్ఎల్ రూ. 599 ప్లాన్

ఇది బిఎస్ఎన్ఎల్ అందించిన 70 రోజుల లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 70 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు డైలీ 3జీబీ హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40 Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ హెవీ డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.

ఒకవేళ మీరు అధిక డేటా కాకుండా తక్కువ ధరలో 70 రోజులు అన్లిమిటెడ్ లాభాలు కోరుకుంటే కూడా మీకు బెస్ట్ ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది. అదే, బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 485 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్.

Also Read: PHILIPS Dolby Atmos సౌండ్ బార్ ఫస్ట్ టైమ్ అతి చవక ధరలో లభిస్తోంది.!

బిఎస్ఎన్ఎల్ రూ. 485 ప్లాన్

ఇది కూడా బిఎస్ఎన్ఎల్ అందించిన లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 72 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 72 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS వంటి ప్రయోజనాలు అందుకుంటారు. ఇక డేటా విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది మరియు ఈ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.

ఈ రెండు ప్లాన్స్ కూడా 72 రోజుల లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే యూజర్లకు తగిన బెస్ట్ ప్లాన్స్ గా ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :