BSNL: 2 వేల కంటే తక్కువ ఖర్చుతో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

HIGHLIGHTS

BSNL బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్

ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో వన్ అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు

2025 కొత్త సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్

BSNL యూజర్లకు అందుబాటులో ఉన్న గొప్ప వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి వివరించనున్నాము. 2025 కొత్త సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తక్కువ ధరలో కూడా వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే 2 వేల కంటే తక్కువ ఖర్చుతో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు ఈ ప్లాన్ అందిస్తుంది.

BSNL బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ మూడు వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. వీటిలో రూ. 1,999 తక్కువ ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా చెప్పబడుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు యూజర్లకు ఆల్ రౌండ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు క్రింద చూడవచ్చు.

BSNL రూ. 1,999 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో పూర్తి వ్యాలిడిటీ కాలానికి 600GB ల హై స్పీడ్ డేటా తీసుకు వస్తుంది. అంటే, మొత్తం డేటాని రోజువారీగా విభజిస్తే రోజుకు రోజుకు 1.64GB అవుతుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ బెస్ట్ బడ్జెట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్, కాలింగ్, డేటా మరియు SMS వంటి పూర్తి ప్రయోజనాలు అందిస్తుంది.

మరిన్ని బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :