BSNL: మార్చ్ 31 తో ముగియనున్న ఈ బంపర్ అఫర్ ను మిస్సవ్వకండి.. !!

HIGHLIGHTS

BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

ఉచిత వ్యాలిడిటీని అఫర్ చేసే లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్

ఈ బిఎస్ఎన్ఎల్ అఫర్ మార్చ్ 31 తో ముగియనునట్లు ప్రకటించింది.

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) కస్టమర్లకు అధిక ప్రయోజనాలను అందించే ఉదేశ్యంతో తీసుకువచ్చిన బెస్ట్ అఫర్ మార్చ్ 31 తో ముగియనుంది. BSNL తన కస్టమర్లకు అదనపు ఉచిత వ్యాలిడిటీని అఫర్ చేసే లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ ను అందించింది. ఈ ప్రీతిపాత్రమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలా కాలంగా వినియోగదారులకు అందుబాటులో వున్నాయి. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ అఫర్ ను ఈనెలతో ముగిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. మనం మాట్లాడుకుంటున్నది రూ.2999 మరియు రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి. ఈ ప్లాన్స్ అఫర్ చేసే ప్రయోజనాలు మరియు పూర్తి వివరాలను గురించి చూద్దాం.

BSNL రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL యొక్క రూ. 2399 ప్లాన్‌ ఒక సంవత్సరం చెల్లుబాటుతో అందుబాటులో ఉంది. అయితే, మార్చి 31, 2022 లోపు కనుక మీరు ఈప్లాం రీఛార్జ్ చేసుకుంటే 60 రోజుల అదనపు ఉచిత వ్యాలిడిటీని పొందుతారు. అంటే, పూర్తిగా రెండు నెలల వ్యాలిడిటీ ఫ్రీ గా అందుకోవచ్చు. BSNL యొక్క ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది మరియు అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తో డైలీ 100SMS లను మరియు ErosNow సబ్ స్క్రిప్షన్ కూడా కాంప్లిమెంటరీ గా అందిస్తుంది.

BSNL రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL యొక్క రూ. 2,999 ప్లాన్‌ కూడా వాస్తవానికి ఒక సంవత్సరం చెల్లుబాటుతో అందుబాటులో ఉంది. అయితే, మార్చి 31, 2022 లోపు కనుక మీరు ఈప్లాన్  రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల అదనపు ఉచిత వ్యాలిడిటీని పొందుతారు. అంటే, పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ ఫ్రీ గా అందుకోవచ్చు. BSNL యొక్క ప్లాన్ డైలీ 3GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది మరియు అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని కూడా చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్ తో డైలీ 100SMS లను కూడా  అందిస్తుంది.

మరియని BSNL బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here    

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :