BSNL: తక్కువ ఖర్చులో కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలు సంవత్సరం అందించే టాప్ ప్లాన్.!

HIGHLIGHTS

ఎక్కువ ప్రయోజనాలను మరియు వ్యాలిడిటీ ని అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ ఎన్నింటినో BSNL అఫర్ చేస్తోంది

కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలు సంవత్సరం అందించే BSNL టాప్ ప్లాన్ గురించి రోజు తెలుసుకుందాం

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అందిస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్

యూజర్లను ఆకట్టుకునే ప్లాన్స్ అందించే టెలికం కంపెనీ లలో అన్నింటి కన్నా ముందుండే కంపెనీగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పేరుగాంచింది. ఎందుకంటే, బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ అతి తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను మరియు వ్యాలిడిటీ ని అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ ఎన్నింటినో అఫర్ చేస్తోంది. అందుకే, కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలు సంవత్సరం అందించే BSNL టాప్ ప్లాన్ గురించి రోజు తెలుసుకుందాం. 

BSNL యొక్క రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ ను తక్కువ ఖర్చులో కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలు సంవత్సరం అందించే టాప్ ప్లాన్ గా అభివర్ణించవచ్చు. ఎందుకంటే, ఈ ప్లాన్ ను నెలకు సరాసరిన లెక్కిస్తే కేవలం రూ. 100 కంటే తక్కువ ఖర్చులోనే ఈ ప్లాన్  కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలు తీసుకు వస్తుంది. మరి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అందిస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా. 

BSNL Rs. 1,198 ప్లాన్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ యొక్క బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా ఒక సంవత్సరం (365 రోజుల) వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ తో నెలకు 300 నిముషాల కాలింగ్, 3GB డేటా మరియు 30 SMS ల వినియోగ ప్రయోజనాలను ప్రతినెలా అందిస్తుంది. అంటే, 12 నెలలకు ప్రతీ నెలా కూడా ఈ ప్రయోజనాలను మీరు అందుకోవచ్చు. 

ఈ ప్లాన్ లిమిటెడ్ గా కాలింగ్, డేటా మరియు SMS లను ఉపయోగించే వారికి తగిన విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు అన్లిమిటెడ్ కాలింగ్, అధిక డేటాని కోరుకుంటే మాత్రం ఈ ప్లాన్ మీకు తగినది కాకపోవచ్చు. అయితే, మీరు BSNL యొక్క రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ ను పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ BSNL ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు. 

BSNL Rs. 1,999 ప్లాన్

ఈ BSNL ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 365 రోజుల వ్యాలిడిటీ తో వసుంది మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ తో మీరు 600 GB హై స్పీడ్ డేటా ని పూర్తి చెల్లుబాటు కాలానికి అందుకుంటారు. ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్ డైలీ 100SMS లిమిట్ ప్రయోజనాన్ని కూడా ఈ ప్లాన్ తీసుకువస్తుంది. 

ఈ ప్లాన్ తో 30 రోజుల లిమిటెడ్ పిరియడ్ తో మరికొన్ని ప్రయోజనాలను కూడా BSNL ఈ ప్లాన్ తో జత చేసింది. Eros Now, Free PRBT Lokdhun కంటెంట్ ను 30 రోజుల పాటు ఈ ప్లాన్ తో ఉచితముగా ఉపయోగించే అవకాశాన్ని యూజర్లు పొందుతారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :